వికలాంగుల సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాము
వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 23
తెలంగాణ వికలాంగుల సహకార సంస్థలోని వివిధ యూనిట్లలో, వివిధ జిల్లాల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ మలక్ పేటలోని వికలాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలంలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పలువురు ఉద్యోగులు వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను కూలంకుషంగా విన్న వీరయ్య వికలాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల శాఖ మంత్రివర్యులు సీతక్క సహకారంతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను క్రోడీకరించి ప్రభుత్వంతో చర్చించి సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు.
సంస్థ ఉద్యోగులందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేసి వికలాంగుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించాడు. వికలాంగుల సమస్యల పట్ల ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా ఉందని దానికి ఉద్యోగులు సహకరించాలని అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఉద్యోగుల అందరితో నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయగానే ముత్తినేని వీరయ్య గారు సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం పట్ల ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ, జనరల్ మేనేజర్ ప్రభంజన రావు, ఆయా జిల్లాల ఉద్యోగులు, టిసీపీసీ బ్రెయిలీ ప్రెస్ ఏఎల్ఎంయు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.