డిఎస్ అడుగుజాడ లో సంఘాన్ని బలోపేతం చేస్తాం 

డిఎస్ అడుగుజాడ లో సంఘాన్ని బలోపేతం చేస్తాం

 

నిజామాబాద్ నవంబర్ 20 (ప్రశ్న ఆయుధం)

ఈనెల 23 న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానం పలికిన మాజీ మేయర్ సంజయ్.

మున్నూరు కాపుల ఐక్యమే లక్ష్యం: ధర్మపురి సంజయ్

జిల్లా మున్నూరు కాపుల సంఘ బలోపేతం కోసం తన తండ్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు–మాజీ పీసీసీ అధ్యక్షుడు–మాజీ ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ చేసిన సేవలు ఆదర్శమని మున్నూరు కాపుల నూతన జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. గురువారం వినాయకనగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సంజయ్ మాట్లాడుతూ, “మున్నూరు కాపుల అభివృద్ధి కోసం నా తండ్రి ఎనలేని కృషి చేశారు. కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ అందరికీ న్యాయం చేయాలనే ధ్యేయంతో పనిచేశారు’’ అని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకు కూడా బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు.

ఈ నెల 23న జిల్లా కేంద్రంలో నిర్వహించే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నట్లు చెప్పారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

బీఆర్ఎస్ కీలక నేతలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా మున్నూరు కాపుల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో కుల బంధువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment