జిల్లాలోని యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తాం ..
డిఆర్ డిఏ పిడి సురేందర్
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 12, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లాలోని యువత, విద్యార్థుల, మహిళల నైపుణ్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని డిఆర్డిఏ పిడి సురేందర్ అన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పి.డి. సురేందర్ ను ఘనంగా సన్మనించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో యువత, మహిళలు అధిక సంఖ్యలో విద్య, స్వయం ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతున్నారని దీనివల్ల నిరుద్యోగం పెరుగుతుందనీ తెలిపారు. ఇందుకు కారణం జిల్లాలో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు లేకపోవడంతో పాటు మల్టీమీడియా, వెబ్ ఆధారిత కోర్సులలో ప్రవేశానికి జిల్లా కేంద్రంలో శిక్షణ సెంటర్లు లేక విద్యార్థులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో నిరుద్యోగులుగా మారుతున్నారని వివరించారు. మహిళా సంఘాల ద్వారా వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజీతో ఇస్తున్నా వ్యాపార, వాణిజ్య రంగాలలో ఉపాది, ఉద్యోగ అవకాశాలు జిల్లా వ్యాప్తంగా లభించచడం లేదని దేనివలన అనుకున్నంత మార్పులు రావడం లేదని అన్నారు. ఈ ఏడాది కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలతో యువతలోని నైపున్యాయాభివృద్ధికి కృషి చేస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అస్థిరమైన ఆలోచన నుండి యువతలోని నైపుణ్యాల
ను వెలికి తీయడానికి కృషి చేయాలని డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ కోరారు.
డిఆర్ డిఏ పిడి సురేందర్ మాట్లాడుతూ జిల్లాలోని యువత, మహిళలతో సమన్వయం చేసుకుంటూ నేటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నిరంతరం ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ వివిధ రకాలైన కంపెనీలతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సాయి కుమార్ ముదిరాజ్ , బాలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.