*ఉపాధ్యాయుల సమస్యలపై సాధనకు కృషి చేస్తాం*
*ఆడోహాక్ కమిటీ పి ఆర్ టి యు మండల అధ్యక్షుడిగా జయప్రకాష్ ప్రధాన కార్యదర్శిగా రాములు*
*ఏకగ్రీవం చేసిన జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్ రెడ్డి*
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 23 ప్రశ్న ఆయుధం*
ఉపాధ్యాయుల సమస్యల సాధనకు కృషి చేస్తామని ఆడోహాక్ కమిటీ పి ఆర్ టి యు మండలాధ్యక్షుడు జయప్రకాష్ ప్రధాన కార్యదర్శి రాములు అన్నారు ఇటీవల ఖాళీ అయిన పిఆర్టియు మండల మండల అధ్యక్ష కార్యదర్శులు నియమించుటకు జిల్లా పి ఆర్ టి యు అధ్యక్షుడు ఐలేని కరుణాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మర్రి జైపాల్ రెడ్డి మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ ఇల్లందకుంటకు చెందిన ఉపాధ్యాయుడు కలికోట జయప్రకాష్ ను హడాక్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపీపీ ఎస్ రాచపల్లి చెందిన ఉపాధ్యాయుడు పల్లె రాములు ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఏకగ్రీవం చేశారు ఎన్నికైన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మాపై నమ్మకంతో మాకు ఇచ్చిన ఈ బాధ్యతలను ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తామని సమస్యల సాధనకు కృషి చేస్తామని తెలిపారు పి ఆర్ టి యు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన జయప్రకాష్ రాములు లకు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పాకాల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షరాలు యం.పద్మ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఏ. అశోక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.రవి రాజేందర్రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కే సత్యం మండల అసోసియేట్ అధ్యక్షుడు బి కృష్ణమూర్తి ఉపాధ్యక్షురాలు బి వరలక్ష్మి కార్యదర్శి ఇ శ్రీనివాస్ ఉపాధ్యాయులు అభినందనలు తెలిపినారు