వ్యాపారీకరణలో భాగంగా జరిగే,
నూతన సంవత్సర సంబరాలను వ్యతిరేకించండి
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య CPI(ML)మాస్ లైన్ అనుబంధం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం (ప్రశ్న ఆయుధం)
2024 వ సంవత్సరం గడచిపోయి, 2025 సంవత్సరం ఏర్పడిన సందర్భంగా, ములకలపల్లి మండలం పాత గుండాలపాడు గ్రామపంచాయతీ చలమన్న నగర్ గ్రామంలో, నూతన సంవత్సర సంబరాలను వ్యతిరేకిస్తూ, విప్లవ ప్రజా ఉద్యమాలను స్వాగతిస్తూ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చలమన్న నగర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆట – పాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గ్రామ నాయకుడు సోయం రాము అధ్యక్షతన జరిగిన ఆటా – పాట కార్యక్రమంలో CPI (ML) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నూపా భాస్కర్, ప్రగతిశీల మహిళా సంఘం(POW) జిల్లా నాయకురాలు నూపా సరోజిని, PYL డివిజన్ నాయకుడు కుర్సం ముకేశ్ , అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గ్రామ కమిటీ కార్యదర్శి వెలకం వెంకటేష్, CPI (ML) మాస్ లైన్ గ్రామ కమిటీ కార్యదర్శి కారం దూలయ్య లు మాట్లాడుతూ, నిజానికి కాలం అనేదానికి – కొత్త అంటూ ఉండదని,భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగితే ఒకరోజు అని, అట్లాగే భూమి 30 రోజులు తిరిగితే – ఒక నెల అని, భూమి 12 నెలలు తిరిగితే – ఒక సంవత్సరం గడచిపోయి మరో సంవత్సరం ఏర్పడుతుందని, అంతేకానీ అది నూతన సంవత్సరం కాదని అన్నారు.
కానీ , భూమి ఒకరోజు మాత్రమో? ఒకనెల మాత్రమో? ఒక సంవత్సరం మాత్రమో? తిరిగి ఆగిపోదు. భూమి ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది.
అట్లాంటప్పుడు , ఇంకా
కొత్త సంవత్సరం ఏమిటీ ?
అది కేవలం క్యాలండర్ లెక్క మాత్రమే అన్నారు.
పాలకులు మరియు పెట్టుబడిదారులు,
వారి కంపెనీలలో ఉత్పత్తి (తయారు) అయిన అదనపు సరుకులు అమ్ముడు పోవడం కోసం ప్రతి సంవత్సరం నూతన సంవత్సర సంబరాలకు పిలిపునిస్తూ ఉంటారు.
భూమి ఎప్పటి లాగానే , తనచుట్టూ తాను తిరుగుతూ , సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.
డిశంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత భూమి తిరగటం ఆగిపోవటం లేదే! అలాంటప్పుడు , నూతన సంవత్సరం అనేదానికి అర్ధం ఏమిటి ? పాలకులు మరియు పెట్టుబడిదారులను ప్రశ్నించారు. ఇప్పటికి ఈ నెల డిశంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలకు, క్రీస్తు శకం నుండి 2024 సంవత్సరాలు గడిచిపోయి, 2025 వ సంవత్సరం లెక్క ఏర్పడుతుదని, అంతే కానీ అది నూతన సంవత్సరం కాదని అన్నారు.
గుడ్డిగా నూతన సంవత్సరం పేరుతో సంబరాలు చేసుకుంటే ప్రజల సమస్యలు పరిష్కారం కావని అన్నారు.
కావలసింది కొత్త విధానం కానీ,కొత్త సంవత్సరం కాదుగదా? అని అన్నారు. ఆ కొత్త విధాన్నాని ఎప్పుడైనా రూపొందించుకోవచ్చునని ప్రజలకు పిలుపు నిచ్చారు.
భావవాద సిద్ధాంత కర్తలు
పాలకులు మరియు పెట్టుబడిదారులు
చెపుతున్నట్లు, సంవత్సరం కొత్తది అయితే,నెల కొత్తది కావాలి. రోజు కొత్తది కావాలి.గంట కొత్తది కావాలి.నిమిషం కొత్తది కావాలి.సెకండ్ కొత్తది కావాలి కదా.. కనుక దానికి కూడా, ఇకముందు అవికూడా , వారి కంపెనీలలో ఉత్పత్తి అయ్యే అదనపు సరుకులు అమ్ముడు పోవడం కోసం అవి కూడా కొత్తవే అంటారు కాబోలు! అని ఎద్దేవ చేశారు.
అందుకే ప్రజలారా.. వ్యాపారీకరణలో భాగంగా జరిగే , సంవత్సర సంబరాలను వ్యతిరేకించి , ప్రజల మౌలిక సమస్యలు సాధించుట కొరకు, విప్లవ ప్రజా ఉద్యమాల తీవ్రతరం చేయాలని ప్రజనీకానికి పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో CPI (ML) మాస్ లైన్ మండల నాయకుడు వెలకం చలమన్న, గ్రామ నాయకులు సోయం దేశయ్య, కారం శ్రీను, కణితి రాము PYL గ్రామ నాయకులు మడివి నాగేష్, మడకం రమేష్ AIUKS గ్రామ నాయకులు కనితి జోగయ్య, సోయం వెంకటేష్, మడకం రాజు తదితరులు నాయకత్వం వహించారు.