ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ సందర్శన యాత్ర ప్రారంభం 

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ సందర్శన యాత్ర ప్రారంభం

 

– సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి

 

– జిల్లా కన్వీనర్ శివప్రసాద్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 8

 

 

అఖిల భారత విద్యార్థి సమైక్య కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా సంక్షేమ హాస్టల్ ల సందర్శన యాత్రను మంగళవారం ప్రారంభించడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శివప్రసాద్ అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టి బాలుర హాస్టలను సందర్శించి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులు అనేక ఇబ్బందులతో గురవుతున్నారనీ, ఇప్పటివరకు సంక్షేమ హాస్టల్లో నాణ్యతలేని ఆహారం, సరైనటువంటి మరుగుదొడ్లు బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచిన కష్టాలలో మాత్రం నాణ్యత లేని ఆహారం తిట్టడం వలన విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. ఇప్పటివరకు టెన్త్ క్లాస్ పిల్లలకు ట్యూషన్ చెప్పడం లేదని, పెరిగిన ధరలు అనుగుణంగా కాస్మోటిక్ బిల్లు ఇవ్వాలని, తాగడానికి మంచి నీళ్లు సౌకర్యం కల్పించాలని, వర్షాకాలంలో కొంతమంది పిల్లలకు వైరల్ ఫీవర్ రావడం జరుగుతుందన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎల్ సంపత్, సుమన్, హరీష, అభి, లడ్డు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now