కాంగ్రెస్ చేసేవి విజయోత్సవాలు కావు రాక్షసొత్సవాలు – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

కాంగ్రెస్ ప్రజపాలన పేరుతో స్వీకరించిన దరఖాస్తులు మూసిలో ముంచారా..? ఆరు గ్యారంటీలు గంగలో కలిపారా అని ప్రశ్నించారు.

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 12:

నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం చేసావని 26 రోజుల విజయోత్సవాలు చేసుకుంటున్నారని ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఏడాది పాలన మొత్తం కమిషన్లకు కసరత్తులు చేయడం, ఉన్నది లూటి చేయడానికే సరిపోయిందని అన్నారు. తెలంగాణాలో ఏడాది పాలన దోచుకోవడంలో బ్రిటిషోన్ని మించిపోయిందని ఏద్దేవా చేసారు.

తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ ఏడాది పాలన చూసి అసహ్యించుకుంటున్నారని, వంద రోజుల్లో అమలు చేస్తానన్నా ఆరు గ్యారంటీలకు ఒక్క గ్యారంటీ కూడ పూర్తిగా అమలు చేసిన దిక్కు లేదు..! కానీ విజయోత్సవాలు అనడానికి సిగ్గు ఉందా అని కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నించారు. యావత్ తెలంగాణ సమాజం మీరు చేసే వికృత చేష్టలకు సిగ్గుపడుతుందని ఏ వర్గం ప్రజలు మీతో సంబరాలు చేసుకోవాలో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు.

రైతన్నలకు రుణమాఫీ కాకా పండించిన పంటలు కల్లాలలో ఉండి అకాల వర్షానికి నష్టపోయి రైతు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్ కు విజయోత్సవాలా..? ఏది మీ రైతు రాబోసా…ఎక్కడ మీ పంట బోనస్…? మహాలక్ష్మి పథకం కింద మా ఆడబిడ్డలకు 2500 ఇచ్చివా …? చేయూత కింద మా అవ్వ, తాతలకు పెన్షన్ 4 వేలు ఇచ్చివా…? ఇళ్ళు లేని గారిబోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిచ్చినవా…?యువ వికాసం పథకం కింద విద్యార్థులకు విద్య భరోసా 5 లక్షలు ఇచ్చినవా…? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4 వేలు ఇస్తున్నావా…? చదువుకునే ఆడపిల్లలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇచ్చినవా…? పెళ్ళైన మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చినవా…? ఏమి ఇచ్చావు అని ఉత్సవ పండగలు చేసుకోవాలో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఇచ్చిన గ్యారంటీలను, హామీలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాని ప్రజలు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు ఏమైనాయి అని అధికారాలను ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నారు. ప్రజపాలనలో స్వీకరించిన దరఖాస్తులు మూసిలో ముంచారా…! ఆరు గ్యారంటీలను గంగలో కలిపారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వలేదు కానీ మా భూమి వివరాలు ఎందుకు చెప్పాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. నేను కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేస్తున్న ప్రజల ఆస్తుల వివరాలు, వారి జీతాబత్యాల వివరాలు తెలుసుకునే ముందు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల ఆస్తుల పైన, జీతాబత్యాల శ్వేతపత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు.

సర్వేకు బిజెపి వ్యతిరేకం కాదని ఇంటింటికి వెళ్లి రుణమాఫీ కాని రైతులు ఎందరు ఉన్నారో, రైతు భరోసా,పంట భీమా వర్తించక ఎంత మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసుకోని వాళ్లకు న్యాయం చేయలన్నారు. వచ్చిన తెలంగాణలో పదేళ్లు BRS పాలనలో ఉద్యోగాలు రాక ఎంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసుకోండి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఇప్పటికి రేషన్ కార్డు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని పెన్షన్ రాని అవ్వ, తాతలు ఉన్నారని వారికీ మీరు తక్షణమే న్యాయం చేయలని డిమాండ్ చేసారు.

అంతే కాని కులగణన పేరుతో, కుటుంబ సర్వే పేరుతో, మి సోనియామ్మ జన్మదినం పేరుతో కాలయాపన చేస్తే మేము చూస్తూ ఊరుకోము, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల, హామీలు అమలు చేసేవరకు విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ళ లక్ష్మీనారాయణ. బిజెపి కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు, బిజెపి నాయకులు, ఇల్లందుల ప్రభాకర్ గారు, ఇప్పకాయల కిషోర్ గారు, ఆనంద్ బట్టికిరి, భాస్కర్ శివ నూరి, మఠం పవన్, పవన్ ముందడ, మారవార్ కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment