ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు బడికి వెళ్లి ఏం చేస్తారు..

కలెక్టర్ ఇచ్చిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్ ఆదేశాలను రద్దు చేయాలి ..

పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులను మా బడిలోనే ఉంచాలి..

ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు బడికి వెళ్లి ఏం చేస్తారు

ప్రాథమిక బడిలో ఉపాధ్యాయులు లేకుండా చేస్తే ఉద్యమం తప్పదు..

గొంపల్లి గ్రామ పాఠశాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా …

IMG 20240825 WA0035

చర్ల మండలం గొంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ముందు గ్రామస్తులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ జారీ చేసిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్ను రద్దు చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండా చరణ్ మాట్లాడుతూ ఇప్పటికే ఉపాధ్యాయులు లేక సరైన వస్తువులు లేక సౌకర్యాలు లేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలు దీన పరిస్థితిలో ఉన్నాయని దాని కారణంగా విద్యార్థులు రోజురోజుకీ హాజరు సంఖ్య తగ్గిపోతుందని అన్నారు ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వం అధికారులు ఈ ప్రభుత్వ బడిని కాపాడాలి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి హాజరు శాతాన్ని పెంచాలి అట్లాంటి అధికారులు ఈరోజు అరకురగా ఉన్న ఉపాధ్యాయులను కూడా డిప్టేషన్ పేరుతోటి వేరే పాఠశాలలోకి పంపించడం అనేది ప్రాథమిక పాఠశాలను చంపడం అవుతుందని అన్నారు కలెక్టర్ కి చిన్న బడి అంటే ఎందుకు ఇంత చిన్నచూపు అని అన్నారు డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయులని హై స్కూల్ కి పంపిస్తే మరి ఈ ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులకు పాఠాలు ఎవరు చెప్తారు అని ప్రశ్నించారు కలెక్టర్ జారీ చేసిన ఉపాధ్యాయుల డిప్రెషన్ ని తక్షణమే రద్దు చేయాలని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా చేసే ప్రక్రియను నిలిపివేయాలని అన్నారు పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు బడికి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు ఈ ప్రక్రియ కేవలం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అవుతుందని దీనికి కలెక్టర్ బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు ప్రాథమిక బడిలో ఉపాధ్యాయులు లేకుండా చేస్తే ఉద్యమం తప్పదు అని అన్నారు ప్రజలు తమ బడిలో ఉన్న ఉపాధ్యాయులను ఎక్కడికి పోనివ్వకుండా కాపాడుకోవాలని పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చదువుని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఉద్యమానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల కమిటీ గ్రామస్తులు తదితరులు  పాల్గొన్నారు….

Join WhatsApp

Join Now