ఎమ్మెల్యే వీరేశం కు జరిగిన ఘటన విచారకరం

భువనగిరి లో మంత్రుల పర్యటన సందర్భంగా మాదిగ జాతీ ముద్దు బిడ్డ యం ఎల్ ఏ వేముల వీరేశం కు ఎదురైనా ఘటన విచారకరం

తక్షణం యం ఎల్ ఏ వీరేశానికి పీడిత వర్గాల సమాజానికి
క్షమాపణ చెప్పాలి

ప్రోటోకాల్ విస్మరించి న అధికారుల పై,ఎం ఎల్ ఏ విరేశాన్ని అడ్డుకున్న పోలీస్ అధికారులపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర నాయకులు – యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్ట్ 31 ప్రశ్న ఆయుధం :

యాదాద్రి భువనగిరి జిల్లా లో
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశం కోసం ముఖ్య అతిథులు గా విచేస్తున్న తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని సమావేశానికి ఆహ్వానించడం కోసం మిగతా ప్రజా ప్రతినిధుల తో పాటు హెలిపాడ్ దగ్గరకు వెళ్తున్న నకిరేకల్ యం ఎల్ ఏ మాదిగ జాతీ ముద్దు బిడ్డ వేముల వీరేశాన్ని వెళ్లనివ్వకుండా ప్రోటోకాల్ విస్మరించి పోలీస్ అధికారులు అడ్డుకోవడం విచారకరం. ఈ సంఘటన యావత్ మాదిగ, దళిత, పీడిత వర్గాల సమాజాన్ని కలచి వేసింది. ఒక నియోజకవర్గానికి రాజ్యాంగ బద్దంగా ప్రజల ఓట్ల తో ఎన్నికైన శాసన సభ్యుడి నే ప్రోటోకాల్ పాటించకుండా అడ్డుకోవడం తో సాధారణ సగటు సమాజానికి అధికారులు ఎలాంటి సందేశం ఇస్తున్నారని, ఇది పీడిత వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని
ఈ సంఘటన ను తీవ్రంగా ఖండిస్తున్నామని తక్షణమే యం ఎల్ ఏ వేముల వీరేశం కు పీడిత వర్గాల సమాజానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పియాస్ రాష్ట్ర నాయకులు యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ అన్నారు. శాసన సభ్యులు ప్రోటోకాల్ పరిధి లో వస్తారని మరి యం ఎల్ ఏ వీరేశం పేరు ప్రోటోకాల్ జాభితాలో చేర్చలేదా..? చేర్చకుంటే ప్రోటోకాల్ జాభితా రూపొందించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేదా ప్రోటోకాల్ జాభితాలో యం ఎల్ ఏ వీరేశం పేరు చేర్చినా కూడా భద్రత కల్పిస్తున్న పోలీస్ అధికారులు ఉద్దేశ్య పూర్వకంగా అడ్డుకుంటే ఆ అడ్డుకున్న పోలీస్ అధికారులపై విచారణ జరిపి సంఘటన కు కారకులేవరో తేల్చి వారిపై ఉన్నత స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి అని భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు.లేకుంటే దీనిపై పీడిత వర్గాల సమాజాన్ని ఏకం చేసి ఉద్యమాలు చెపడుతామని అన్నారు.

Join WhatsApp

Join Now