ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో ఏం చేసింది?

ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో ఏం చేసింది?*

*విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి*

*ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలు తీసుకువస్తాం*

*గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు*

*దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు*

*మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం*

*వైసీపీ హయాంలో సీఎం సతీమణి కోసం క్యాంప్ ఆఫీసు చాలా వింతగా ఉంది*

*వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్!*

*ప్రజలందరూ కలిసి ప్రధాని రోడ్ షో, బహిరంగ సభను విజయవంతం చేయాలి*

*విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్*

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర కోసం ఐదేళ్లలో వైసీపీ చేసిందేమీ లేదని, కనీసం రైల్వే జోన్ కు భూమి కూడా ఇవ్వలేదని, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్ లో సమీక్ష అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసుకున్నాం. 8వ తేదీన ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. అందులో భాగంగా సుమారు కిలోమీటర్ వరకు రోడ్ షో ఉంటుంది. దీనితర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి  శంకుస్థాపన చేస్తారు. 2014 నుంచి ఎన్డీయే ప్రభుత్వ నినాదం ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ. ఇందులో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేస్తున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. దాదాపు రూ.70వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతోంది. నెల్లూరుకు వచ్చేసరికి చెన్నై-విశాఖ ఇండస్ట్రియలన్ కారిడార్ లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో కేంద్ర ప్రభుత్వం నోడ్ శాంక్షన్ చేసింది. నిధులు కూడా కేటాయించారు. ఆ నోడ్ వల్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ నోడ్ కు కూడా శంకుస్థాపన చేస్తారు. పలు జాతీయ రహదారులను నిర్మించడం జరుగుతుంది. సుమారు రూ.5వేల కోట్లు ఖర్చుపెట్టి కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నాం. ఇప్పటికే పూర్తైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. రైల్వే జోన్ అందరి కల. జోనల్ హెడ్ క్వార్టర్ విశాఖలో ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు. దీనివల్ల ఆలస్యమైంది. భూమి మన ప్రభుత్వం కేటాయించింది. హెడ్ క్వార్టర్ ఏర్పాటుచేసేందుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇవేకాకుండా పలు రైల్వేకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

*ప్రధాని రోడ్ షో ను డబుల్ సక్సెస్ చేయాలి*

అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోంది. బహిరంగ సభను ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం. చిలకలూరిపేటలో గతంలో బహిరంగ సభ ఏర్పాటుచేశాం. అది బంపర్ సక్కెస్ అయింది. విజయవాడలో రోడ్ షో చేశారు. అది కూడా సక్సెస్ అయింది. ఇది కూడా డబుల్ సక్సెస్ చేయాలనే తపనతో పనిచేస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రధాని అండగా నిలబడాలి. గత బడ్జెట్ లో కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు చేశారు. దారితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇప్పటికే చాలా అప్పులపాలయ్యాం. వడ్డీ కట్టేందుకే అవస్థలు పడుతున్నాం. కేంద్ర సహకారం చాలా అవసరం. పోలవరానికి రూ.2వేలకోట్ల నిధులు ఇచ్చారు. నిర్వాసితులకు దాదాపు రూ.900 కోట్లు విడుదల చేశారు.

*ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో ఏం చేసింది?*

ప్రస్తుత పెట్టుబడుల ద్వారా దాదాపు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. వైసీపీ ఫేక్ పార్టీ. ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో ఏం చేసింది? కనీసం రైల్వే జోన్ కు భూమి కూడా ఇవ్వలేదు. ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు. ఉన్న కంపెనీలు వెళ్లిపోయాయి. టీసీఎస్ మేం తీసుకువచ్చాం. రుషికొండ తప్ప వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదు. మేం డేటాసెంటర్ తీసుకువస్తే మహారాష్ట్రకు తరిమేశారు. లులూ తరిమేశారు. హెచ్ఎస్ బీసీ మూతపడింది. కియా పరిశ్రమను చంద్రబాబు గారు తీసుకువస్తే.. ఆత్మలతో మాట్లాడే జగన్ రెడ్డి.. వైఎస్ తీసుకువచ్చారని దుష్ప్రచారం చేశారు. టీసీఎస్ విషయంలో కూడా ఇంతే. హుద్ హుద్, తిత్లీ తుఫాను, విజయవాడ వరదల సమయంలో సాయం ప్రకటించిన జగన్ రెడ్డి.. ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మా నినాదం. విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం.

*దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు*

సీపీఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ రెడ్డి ఎందుకు చేయలేదు? వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నారు. మేం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం అమలు చేస్తున్నాం. తల్లికి వందనం డేట్స్ ఇచ్చాం, రైతులకు ఇవ్వాల్సింది కూడా తేదీలు ప్రకటించాం. మత్స్యకారులకు ఇస్తున్నాం. మత్య్యకారులకు ఎందుకు బకాయిలు పెట్టారు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఎందుకు పెట్టారు? స్కూల్ కిట్ కు వెయ్యి కోట్లు బకాయిలు పెట్టారు. అవన్నీ మేం చెల్లిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.1800 కోట్లు బకాయిలు పెడితే మేం చెల్లిస్తున్నాం. మేం పారిపోవడం లేదు. ప్రతి నెల రూ.4వేల కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తోంది. జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. కేంద్రం సహకారంతో నెట్టుకుని వస్తున్నాం. టైం పడుతుంది. వైసీపీ విధ్వంసం వల్లే ఇదంతా. పారిశ్రామిక వేత్తలను వైసీపీ ఇబ్బందులు పెట్టడంతో వారు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు.

*ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలు తీసుకువస్తాం*

మిలీనియం టవర్ లో టీసీఎస్ వస్తుంది. ట్రాన్సిట్ బిల్డింగ్ గా వినియోగిస్తారు. టీసీఎస్ సెంటర్ నిర్మాణం కోసం రెండు, మూడేళ్ల సమయం పడుతుంది. అప్పటివరకు ట్రాన్సిట్ గా తీసుకుని ఫేజ్-1లో రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. వారికి భూములు కూడా చూపించడం జరుగుతుంది. ఐటీ కంపెనీలకు పెద్ద సెంటర్ కూడా నిర్మిస్తాం. పెద్దఎత్తున ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలు తీసుకువస్తాం.

*గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు*

గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అరకు కాఫీని రూ.300 కోట్ల నుంచి రూ.3వేల కోట్ల బ్రాండ్ కు తీసుకువెళ్తాం. గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేశాం. అదనంగా నిధులు కూడా కేటాయిస్తున్నాం. ప్లాంటేషన్ ను కట్టడి చేస్తాం. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో ముందుకు వెళ్తున్నాం.

*మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం*

బీసీల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎస్, డీజీపీ, టీటీడీ ఈవో బీసీ సామాజికవర్గాలకు అవకాశం కల్పించాం. మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. లోపాలు ఏవైనా ఉంటే ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం. వైసీపీది దుష్ప్రచారం మాత్రమే. మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. జగన్ సెక్యూరిటీతో పోల్చుకుంటే చంద్రబాబు గారిది 30శాతమే.

*వైసీపీ హయాంలో సీఎం సతీమణి కోసం క్యాంప్ ఆఫీసు చాలా వింతగా ఉంది*

రుషికొండను ఏం చేయాలో మాకే అర్థం కావడం లేదు. రూ.700 కోట్లు దుర్వినియోగం చేశారు. పాత బిల్డింగ్ మరో రూ.300 కోట్లు. మొత్తం వెయ్యి కోట్లు వృధా అయ్యాయి. వైసీపీ హయాంలో సీఎం సతీమణి కోసం క్యాంప్ ఆఫీసు చాలా వింతగా ఉంది. ముఖ్యమంత్రి సతీమణి కోసం క్యాంప్ ఆఫీసు ఎప్పుడూ వినలేదు. దేశంలో కూడా ఎక్కడా లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, మద్యం అంశంపై విచారణ జరుగుతోంది. వైసీపీ హయాంలో అన్ని కుంభకోణాలపైనా విచారణ జరుగుతోంది. త్వరలో యాక్షన్ ఉంటుందని నేను భావిస్తున్నా. వాలంటీర్ల కోసం జీవోను జగన్ రెడ్డి ఎందుకు రెన్యువల్ చేయలేదు?

*ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిది*

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.5వేల కోట్లు అవసరం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుంది. గత వైసీపీ ప్రభుత్వం చేతగానితనం వల్ల 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమయ్యారు. జూనియర్ కాలేజీలను పట్టించుకోలేదు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ను పట్టించుకోలేదు. మేం దృష్టిపెట్టాం.

*****

Join WhatsApp

Join Now

Leave a Comment