చేతులు లేకపోతే ఏమి…?

*చేతుల్లేకపోతే ఏమి ?*

 

*విధిని ఎదిరించాడు. ఎదురీది గెలిచాడు..ఒక మగాడు..*

 

అంగ వైకల్యం ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయలేదు.. విధి వెక్కిరించాలని ప్రయత్నించినా , దాన్ని ధిక్కరించి ఎదురు నిలిచి , జీవితాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని గెలిచిన వ్యక్తి.. తన సంకల్పాన్ని , కలలను ఉడుంపట్టుతో సాధించుకున్న ధీరుడు.. ఎందరో యువకులకు , నిరాశావాదులకు ఒక ఆశాకిరణం లాంటి వ్యక్తి మల్లి సునీల్ కుమార్ ..నెల్లూరు జిల్లా,పొదలకూరు పట్టణంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే రెండుచేతులు కోల్పోయినా మొక్కవోని చదువుకొని ధైర్యంతో ఉన్నతస్థాయికి చేరిన సునీల్ కుమార్ కి క్రికెట్ పై చిన్న నాటి మక్కువ , రెండు చేతులు పోయేందుకు కారణమైంది. క్రికెట్ బాల్ హైటెన్షన్ ఎలక్ట్రిక్ స్తంబంపై ఇరుక్కోవడంతో , దాన్ని తీయడంలో కొట్టిన షాక్ కి రెండు చేతులు పోయాయి. అయినా చదువు ఆపకుండా ఉన్నతస్థాయికి చేరుకున్నాడు. తన రెండు చేతులు పోయేందుకు కారణమైన క్రికెట్ ని కూడా వదల్లేదు. తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా క్రికెట్ ఆడుతూనే ఉంటారు.. అదీ ఆత్మవిశ్వాసమంటే.. అదీ విధిని ఎదిరించి నిలవడమంటే,. ఇదీ ఛాలెంజ్ జీవితమంటే..

Join WhatsApp

Join Now