తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే*

*తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే*

 

*రాజ్యాధికారం కోసం పోరాడకపోవడం వల్లనే బీసీలకు ఈ దుస్థితి*

 

*బీసీలు పోరాడితే అగ్రవర్ణాలు కుర్చీలు ఖాళీ చేయడం ఖాయం*

 

 

నిజామాబాద్ ప్రతినిధి:

తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే నని, రాజ్యాధికారం కోసం పోరాడకపోవడం వల్లనే బీసీలకు ఈ దుస్థితి నెలకొందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

దాసు సురేశ్ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్ లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రౌంట్ టేబుల్ సమావేశం

జిల్లా అధ్యక్షులు ఎం.నాగయ్య

ఉపాధ్యక్షులు అల్లుల్ల నారాయణ

ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

దాసు సురేశ్ మాట్లాడుతూ..రాజ్యాధికార సాధనకై బీసీ గోర్ఖాలను తయారుచేస్తున్నామన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలదీ అవకాశవాద రాజకీయమేనని, జాతీయ పార్టీలు ఓబీసీలను అమాయకులను చేసి మోసపూరిత విధానాలను అనుసరిస్తున్నాయన్నారు. సమాన వాటా కోసం హక్కుల కోసం పార్టీ టిక్కెట్ల కోసం సంక్షేమ పథకాల కోసం ఏ పార్టీ కోసం ఎదురుచూసేది లేదని, చేయిచాచి అడిగేది లేదని, ఇక బరిగీసి కొట్టాడుడే మార్గమన్నారు. దేశరాజకీయలను ప్రభావితం చేసే స్థాయికి అధికారం కట్టబెట్టడంలో బీసీ వర్గాలే నేడు కీలకంగా మారాయని, ఒక పార్టీ కులగణన అంటూ, మరో పార్టీ చేయబోమని ఒకటి తెగేసి చెబుతున్నదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసినా ఆ కులగణన నివేదికను బయటపెట్టకుండా మోసం చేసి, ఇప్పుడు మళ్లా చేస్తామంటూ మాట్లాడతున్నది ఇంకో పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన పై సరైన పర్యవేక్షణ అవసరమన్నారు. బీసీలంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.

రాజ్యాధికారమే జెండా, ఎజెండాగా ముందుకు సాగాలన్నారు. త్వరలో అన్ని మండలాలలో మండల స్థాయిలో అన్ని బీసీ కుల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాలు* నిర్వహిస్తామన్నారు.

లక్ష మందితో త్వరలో ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో

రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడత కిషోర్, హనుమకొండ జిల్లా గౌరవ అధ్యక్షులు జూలూరి రమేష్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి పద్మావతి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు హైమావతి, బీసీ లెక్కరర్స్ జెఎసి స్టేట్ కన్వీనర్ కాముని సుదర్శన్, నిజామాబాద్ ఉపాధ్యక్షులు

కరాటే రమేష్, సలహాదారులు నామాల శంకర్, ఉస్కెల గంగారాం,

కామారెడ్డి ఇన్చార్జి చింతల శంకర్, అద్యక్షులు సూర్య మల్లేష్, సోషల్ మీడియా ఇన్చార్జి రాజేందర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now