Site icon PRASHNA AYUDHAM

కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది

IMG 20250422 WA2181

*కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది*

*ములుగు – ఛత్తీస్ గఢ్, ఏప్రిల్ 22*

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అలజడి రేగింది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను 2 వేల మంది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. బచావో కర్రెగుట్టలు పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అటు ఛత్తీస్‌గఢ్ నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలను సీఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే కర్రెగట్టల చుట్టూ భారీ పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా ప్రకటించిన మావోయిస్టులు.. ఆ వైపు ఆదివాసీలు వెల్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

దీంతో ఏక్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. అయితే ఊసూర్ బ్లాక్ల్‌లోని కర్రెగుట్టల సమీపంలో ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి భద్రతా బలగాలు – మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు.

Exit mobile version