*శబరిమల ఆదాయం.. 9 రోజుల్లో ఎంతంటే?*
*నవంబర్ 16 నుంచి మొదలైన అయ్యప్ప స్వామి దర్శనం*
*భక్తుల రద్దీ ఎక్కువ అవ్వటం వలన దర్శనంకు 10 గంటల సమయం*
శబరిమల :
శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమ్రోగు తున్నాయి. పెద్దసంఖ్యలో మాలధారణ చేసిన స్వాములు రావడంతో స్వామివారి దర్శనానికి దాదాపు 10గంటల సమయం పడుతోంది.మరోవైపు భక్తుల రద్దీ పెరగడంతో పాటు ఆదాయం కూడా భారీగా సమకూరినట్లు దేవస్థానం బోర్డు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో రూ.28.3కోట్లు ఆదాయం రాగా ఈ సారి అది రూ.41.64 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.13.33 కోట్లు ఎక్కువ అని ట్రావన్ కోర్ బోర్డు వెల్లడించింది.