మాస్టర్ ప్లాన్ మౌనం ఎందుకు*?
*మౌనంవెనుక మతలబెంటి*?
*రైతులపై నేటికీ ఎత్తి వెయ్యని కేసులు*
- కామారెడ్డి ప్రశ్న ఆయుధం ప్రతినిధి జులై22
ఇద్దరి ఎమ్మెల్యేల మౌనం దేనికి
*రైతు రాములు కలా నెరవేరేనా**రైతు శ్రీకాంత్ రెడ్డి, వడ్లూర్ ఎల్లారెడ్డి*ప్రశ్న ఆయుధం 22జులై కామారెడ్డి జిల్లా: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం మౌనం విడడం లేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినప్పటికీ కామారెడ్డిలో ఇండస్ట్రియల్ జోన్ లో మాస్టర్ ప్లాన్ వెయ్యవద్దని రైతులు బిస్మించుకొని కూర్చున్నారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కామారెడ్డిలో 50 రోజులపాటు ఉవ్వెత్తున ఉద్యమం కూడా సాగింది. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డిలు మాస్టర్ ప్లాన్ తాము గెలిస్తే రద్దుకు సహకరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆరు నెలలు గడిచిన ఇప్పటికీ మాస్టర్ ప్లాన్ రద్దు కాలేదు. మాస్టర్ ప్లాన్ లో రైతుల పెట్టిన కేసులు ఇప్పటి కి ఎత్తి వెయ్యలేదు. అయితే ఉద్యమాన్ని వెన్నంటే ఉండి నడిపిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని రైతులు చర్చించుకుంటున్నారు. జూట్ పరిశ్రమపై స్పందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాస్టర్ ప్లాన్ పై ఎందుకు మౌనం వేయడం లేదని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే ఇండస్ట్రియల్,గ్రీన్ జోన్లను ఎత్తివేయాలన్నారు.దీనిపై ఇద్దరు ఎమ్మెల్యేలు స్పందించి ప్రజలు న్యాయం చేయాలని ఒక ప్రకటనలో ప్రశ్న ఆయుధం దిన పత్రిక కు తెలిపారు.