మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రక్షణ ఏది 

IMG 20240809 WA2990

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ కరువైందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ఆరోపించారు.మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో పారిశుధ్య కార్మికురాలిగా విదులు నిర్వహిస్తూ మంచినీరు అనుకొని దోమల మందు తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బత్తుల ఓదెమ్మ ను పరామర్శించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా కార్మికుల ప్రాణాల మీదకు వస్తుందని అన్నారు.దోమలకు కొట్టాల్సిన మందును మంచినీళ్ళ బాటిల్ లో పోసి ఇవ్వడమేంటని ప్రశ్నించారు?.ఘటన జరిగిన తర్వాత రెండు గంటలు అయినా కార్మికురాలు తాగిన మందు పేరు కూడా డాక్టర్లకు చెప్పకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.మున్సిపాలిటీలో వరుసగా ప్రమాద ఘటనలు జరిగి కార్మికుల ప్రాణాల మీదకు వస్తున్న అధికారుల పని తీరులో మార్పు రావడం లేదని విమర్శించారు.ఇటీవల కరెంట్ షాక్ తగిలి దుర్గాప్రసాద్ అనే కార్మికుడు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఘటన జరిగి 20 రోజులు గడవక ముందే ఇలా జరగడమంటే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.ఇలాంటి ప్రమాదకర రసాయనాల పనులు కేటాయించేటప్పుడు సూపర్ వైజర్లు సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.చికిత్స పొందుతున్న కార్మికురాలికి పూర్తిగా నయం అయ్యేవరకు మున్సిపల్ అదికారులు భాధ్యత తీసుకొని మెరుగైన వైద్యం అందించాలని,భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,వంగా రవిశంకర్,మురళి,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now