సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ప్రభుత్వ కార్యాలయంలో కనిపించపోవడానికి ఆంతర్యమేంటి..?
అధికారుల వైఫల్యం.లోపమా…?
ఫోటో పెట్టడం ఇష్టం లేదా..?
ఈ విషయంపై ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి..?
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేస్తుంటారు.కానీ కామారెడ్డి జిల్లా లోని కార్యాలయంలో కూడా ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కనిపించడం గమనారం.రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 160రోజులు దాటిన విషయం తెలిసిందే కానీ సీఎం ఫోటో పెట్టకపోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి.గతంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని గ్రామపంచాయతీ నుండి మొదలుకొని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలను పెట్టడం జరిగింది.మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టడం లేదు అని కొందరు విలేకరులు తహసిల్దారులను అడిగితే కొని ఇవ్వండి పెడతాము.అని తాసిల్దార్ సమాధానం ఇచ్చారు మరికొన్ని చోట్ల మాకు అలాంటి ఆదేశాలు ఏమీ రాలేవని అలాంటప్పుడు మేమెందుకు పెడతాము మాకు ఎవరైనా డబ్బులు ఇస్తారా అని అధికారులు అనడం విచిత్రంగా ఉంది.మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు అర్థం కాని పరిస్థితి కామారెడ్డి జిల్లాలో నెలకొంది. మరి ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కార్యాలయంలో పెడతారా లేదా అనేది వేచి చూడాల్సిందే..