ఐశ్వర్య రాజేష్ నాన్న ఎలాంటి వాడు అంటే..

*ఐశ్వర్య రాజేష్ నాన్న ఎలాంటి వాడు అంటే..*

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాలో ఆమె భాగ్యం పాత్రలో అదరగొట్టేసింది. తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసిన అవి పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ.. ఈ తమిళ్ అమ్మడి కేవలం ఒకే ఇండస్ట్రీకి పరిమితం కాలేదు. తమిళ్, మలయాళ భాషల్లోనూ మంచి కథ, ప్రాధాన్యత ఉన్నా పాత్రల్లో నటిస్తూ వైవిధ్యతను ప్రదర్శిస్తోంది. అయితే ఈ అమ్మడి అమ్మడి కాదు తెలుగు అమ్మాయే.. వాళ్ళ నాన్న తెలుగు వాడే, తెలుగు సినిమాల్లో స్టార్‌డమ్ చూసినవాడే..ఐశ్వర్య తండ్రి రాజేష్.. తెలుగువాడే ఆయన ప్రముఖ దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన`నెలవంక` సినిమాలో ‘సలీమ్‌’ పాత్రలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. జంధ్యాల తెరకెక్కించిన రెండు జళ్ల సీత, ఆనంద భైరవి సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే చిరంజీవి నటించిన పల్లెటూరి మొనగాడు, బాలకృష్ణ సీతారామకళ్యాణం, కృష్ణంరాజు ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మాణ్ణ చిత్రాల్లో విలన్ గా నటించాడు. మరో 50కిపైగా చిత్రాలలో కీలక పాత్రల్లో నటించాడు.కానీ.. ఆయన కెరీర్ పీక్స్ లో ఉండగానే మద్యానికి బానిసయ్యాడు. దీంతో లివర్‌ డ్యామేజ్‌ అయ్యింది. అనారోగ్యంతో 38 ఏళ్ల వయసులో మరణించాడు. అప్పుడు ఐశ్వర్య వయసు కేవలం 8 ఏళ్లు మాత్రమే. ప్రముఖ సీనియర్ నటి శ్రీ లక్ష్మి ఈయనకు స్వయానా అక్క.. అంటే ఐశ్వర్య రాజేష్ కి మేనత్త..

Join WhatsApp

Join Now