సింగభూపాలెం ప్రాజెక్టు కంగుబాటు గురైన దానిని సందర్శించిన సిపిఎం బృందం సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండల రిపోర్టర్
ఈ రోజున సుజాతనగర్ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సింగభూపాలెం ప్రాజెక్టుని సిపిఎం బృందంతో సందర్శించినారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగభూపాలెం ప్రాజెక్టు 1936 లో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని 2600 ఎకరాలకు సాగు నీరు అందే విధంగా నాటి కాకతీయుల కాలంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఈ ప్రాజెక్టు వాగున్నచోట నిర్మాణం చేసి 1986లో అమరజీవి కాసాని ఐలయ్య నాయకత్వంలో కట్ట కుంగుబాటు గురైనచోట ప్రజల సహకారంతో ఆధ్వర్యంలో కుంగుబాటు గురైన చోట సిమెంట్ కట్టలు వేసి అక్కడ పార్టీ ఆధ్వర్యంలోని చెరువు కట్ట కాపాడుకున్నారని తిరిగి గత మూడు సంవత్సరాలుగా లూజు సాయిలు ఉన్నచోట బలహీనమైన భూమి ఉన్నచోట వాగు ప్రవహించే ప్రాంతంలో ఎదురుగా ప్రొటెక్షన్ వాల్ నిర్మించి ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని అనేక సందర్భాల్లో అధికారులు చెప్పినప్పటికీ మీనమేషాలు లెక్కగడుతు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అమరజీవి కాసాని ఐలయ్య గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మరమ్మత్తులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ అనేక సందర్భాల్లో పోరాటం చేశారని చెరువు కట్ట మరమ్మత్తు చేయలేక అలుగును బాంబులతో కూల్చివేసి చివరి భూముల నీళ్లు అందకుండా చేశారని అధికారులు ఇప్పటికైనా ఏదైతే బలహీనంగా ఉండి కుంగుబాటు గురవుతుందో చెరువు కట్ట అక్కడ నీళ్లు లేనప్పుడు వేసవికాలంలోనే ప్రొటెక్షన్ వాల్ నిర్మించి దీని శాశ్వత పరిష్కారం చూపాలని తర్వాత పర్యాటక కేంద్రం చేయాలని అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మంత్రులు పర్యాటక కేంద్రం కాదు దీనికి శాశ్వత పరిష్కారం చూపి చివరి భూములకు నీళ్లు అందే విధంగా ప్రాజెక్టు మరమ్మత్తులు చేపట్టాలని లేనిచో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందని సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ, సిపిఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్, కాట్రాల తిరుపతిరావు గండమాల భాస్కర్ బచ్చలకూర శ్రీనివాస్ నర్రా శివరామకృష్ణ, చింతల శ్రీను నల్లగొపు పుల్లయ్య బాలు వెంకటేశ్వర్లు బాణోత్ జ్యోదిరాం కోలాహలం శ్రీధర్ రాజు కొమరరెడ్డి కసనబోయిన గంగయ్య,బాబా పాపారావు సట్టు నరసింహారావు నల్లగొర్ల వేణు, పగడాల లక్ష్మణ్న కృష్ణ, తదితరులు పాల్గొన్నారు
సింగభూపాలెం ప్రాజెక్టు కు శాశ్వత పరిష్కారం ఎప్పుడు
by Naddi Sai
Published On: July 28, 2025 4:34 pm