భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలకి మోక్షం ఎప్పుడు

తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే భక్తులకు కూడా ఈ గుంతల వల్ల కొత్తగా వచ్చేవారు గనుక రోడ్లమీద అవగాహన లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
వరదల కారణంగా మరియు విపరీతమైన అధిక లోడులతో ఇసుక లారీలు వెళ్లటం వల్ల రోడ్లు అంత పాడైపోయాయి.
మరీ ముఖ్యంగా తూరుబాకులో కూలిపోయిన వంతెన కోసం రోడ్డు డైవర్షన్ ఇస్తే ఆ డైవర్షన్ దాటుకొని ప్రధాన రహదారి ఎక్కే ముందే రోడ్లు అద్వానంగా తయారయ్యాయి.
అంతేకాకుండా ప్రధానంగా తూరుబాకలో ప్రమాదపు మలుపుల వద్ద రోడ్లు అద్వానంగా తయారయ్యాయి దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాహనదారులు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు గానీ మానవతా దృక్పథంతో స్పందించేవారు గానీ తొందరగా స్పందించి. ఆ రోడ్డుకి మరమ్మత్తులు జరిపిస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఆశిస్తున్న స్థానిక ప్రజలు.

Join WhatsApp

Join Now