తోలంగూడ, కోసంగూడ,కుమ్బీరికి వలస , ఈ నట్ గూడ లకు రోడ్డు ఎప్పుడు వేస్తారు

**తోలంగూడ, కోసంగూడ,కుమ్బీరికి వలస , ఈ నట్ గూడ లకు రోడ్డు ఎప్పుడు వేస్తారు**

**సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు సూటి ప్రశ్న*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 23 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమేశ్వరరావు

కురుపాం మండలం వబ్బంగి పంచాయతీలో కొండలపై ఉన్న గ్రామంలు తోలంగూడ , కోసం గూడ, కుమ్బిరికి వలస, ఈనట్ గూడ,కోసం గూడా లకు గత 30 ఏళ్లుగా రోడ్డు వేయండి బాబోయ్ అని గిరిజనులు అనేక సందర్భాల్లో మొరపెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇంతవరకు రోడ్డు వేయలేదని ఈ గిరిజన గ్రామాలకు రోడ్లు ఎప్పుడు వేస్తారని సిపిఎం పార్టీ మన్యం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ప్రశ్నించారు తొలింగూడ వచ్చిన ఆయన గిరిజనులతో రోడ్డుపై నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా గంగు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని మన గిరిజన బిడ్డ తోయక జగదీశ్వరి మన కష్టాలు తీరుస్తుందని ఓట్లేసి గెలిపిస్తే కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని అన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అటు పాడేరు ప్రాంతంలో ఇటు సాలూరు మన్యం ప్రాంతంలో పర్యటన చేసి కొన్ని గ్రామాల రోడ్లు ప్రారంభించి మొత్తం గిరిజన గ్రామాలకు రోడ్లు వేయిస్తానని హామీలు ఇచ్చారని ఇంతవరకు ఆ హామీలు నెరవేరలేదని అన్నారు గిరిజన గ్రామాల్లో ఇప్పటికి కూడా రోడ్లు లేక డోలిమోతుల తప్పడం లేదని, గిరిజనులు అటవి ఉత్పత్తులు అమ్ముకోవాలన్న, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు కు గురవుతున్నారు అని వారి పంటలు కు గిట్టు బాటు దర లు రావడం లేదని అన్నారు . అమరావతి రాజధానిలో వేలకోట్ల రూపాయలు తెచ్చి యుద్ద ప్రాతిపదికన రోడ్లు వేసి అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాలకు మాత్రం రోడ్లు వేయడానికి నిర్లక్ష్యం వహిస్తుందని అంటే అమరావతిలో తిరిగిన వారు విలువైన వార గిరిజనుల కారా అని ప్రశ్నించారు. పెత్తందారులున్న గ్రామాలకు మాత్రం ఒకే గ్రామానికి రెండేసి రోడ్లు వేస్తున్నారని గిరిజనులను చులకనగా చూస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లు వెయ్యక పోతే ఈ రోడ్లు కోసం దశలవారీ పోరాటం చేస్తామని అన్నారు .కలెక్టర్ మెమోరాండాలు గతంలో ఇచ్చామని ఇక మెమోరాండాలు ఇవ్వడం జరగదని గిరిజనులు పోరాటాలు కు సిద్ధమవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ఎం .అడ్డమేశ్వరరావు , బిద్దిక భాస్కర్ రావు గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment