విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..
ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 16, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వయంపాలన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోధించారు. ఉపాధ్యాయులుగా తరగతి గదిలో జరిగిన తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రమశిక్షణతో పాటు చక్కని విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించారు, అనంతరం ఉపాధ్యాయులుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ గంగాకిషన్ 37 వ వార్డు కౌన్సిలర్ పాత శివకృష్ణమూర్తి, ఉపాధ్యాయులు భవాని,సుష్మ,జంగం శ్రీశైలం, శ్రీనివాస్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.