Site icon PRASHNA AYUDHAM

ప్రభుత్వాలు మారిన రైతు తలరాత మారే రోజులు ఎప్పుడు వస్తాయి..?

IMG 20250222 WA0036

*ప్రభుత్వాలు మారిన రైతు తలరాత మారే రోజులు ఎప్పుడు వస్తాయి*..?

ప్రశ్న ఆయుధం న్యూస్ 22 ఫిబ్రవరి కామారెడ్డి జిల్లా గాంధారి

రైతు కష్టం అంటే కష్టపడే రైతు జీవితం లో కోలుకోలేని కష్టం ఎదురవ్వడం అని అర్థం. మన చుట్టూ ఉన్న ప్రపంచం లో బీదవాడు, ధనికుడు అనే రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రతి రోజు ఆకలితో పోరాడుతూనే ఉంటారు. ఇందులో ధనికుడు ఆకలి తీర్చుకోవడానికి ఎక్కువ కష్టపడడు కానీ ఒక్క బీదవాడు ఆకలి తీర్చుకోవడానికి ప్రతి రోజు చెప్పలేనంత, చెయ్యలేంత , చూస్తూ ఉండలేనంత కాయ కష్టం చేస్తుంటాడు. కానీ ఈ రెండు వర్గాల కడుపునింపే ప్రతి ఒక్క చిన్నకారు రైతు కుడా బీద వర్గానికి చెందిన వాడే. కానీ ఈ రైతు చేతులు పంట పండించి అన్నం పెట్టె చేతులు. అలంటి అన్నం పెట్టె చేతులకు కష్టం ఎదురయ్యే యదార్ధ సంఘటన

వ్యవసాయ రంగానికి ప్రకృతి విధ్వంసం ఒక సవాలు! అందువల్ల కూడా ఆ రంగం గాలిలో దీపంలా మారింది. వాతావరణం అనుకూలంగా ఉంటే అది తమ ఘనత గా చెప్పుకుంటూ, నష్టం జరిగితే దానిని ప్రకృతిపై, ప్రతిపక్షాలపై నెట్టేస్తోంది ప్రభుత్వం. అకాల వర్షాలు, వరదలు, తుఫానుల బారినుంచి రైతుల్ని, ప్రజల్ని రక్షించడం ప్రభుత్వాల బాధ్యత కాదా? పంట చేతికందే దశలో విపత్తుల విధ్వంసానికి రైతుల కష్టార్జితం పొలాలలోనే కుళ్ళిపోతోంది. రాష్ట్రంలో అరగంటకొక రైతు చావు గంట మోగుతోంది. ప్రకృతి వైపరీత్యాలను నిలువరించడం సాధ్యం కాకపోయినా, వాటి వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంపైన, వాటిని ప్రణాళికా బద్ధంగా ఎదుర్కొని నష్టాలను తగ్గించే శాశ్వత పథకాలను చేపట్టడంపైనా ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు.

అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అర కొర సహాయం రైతుల్ని మరింత కుంగదీసింది. అది రైతులకు ముష్టి వేసినట్టుగా ఉంది తప్ప, వారికి చేయూతనందించేదిగా ఎంతమాత్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విదిలించిన సాయం, పొలాలలో కుళ్ళిన పంటను ఒడ్డున వేసే కూలీలకు ఇవ్వడానికి కూడా సరిపోదు. పైగా ఈ సహాయాన్ని ఒక్క పైసా కూడా పెంచను గాక పెంచను అన్న విధంగా ముఖ్యమంత్రిలు వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ఈ విషయమై చేసిన నిరవధిక దీక్షను రాజకీయ దీక్షగా వర్ణించి తన రైతు వ్యతిరేక స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.

Exit mobile version