జర్నలిస్టుల ఇండ్ల స్థలాల హామీ ఎప్పుడు నెరవేరుస్తారు…

IMG 20240826 WA2475

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

కొత్తగూడెం: జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే నెరవేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకంగా కొనసాగిందని గుర్తు చేశారు,కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వారికి ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని,ఇది సరైన పద్ధతి కాదని మండి పడ్డారు.ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారిదిగా పని చేస్తూ వృత్తి పరంగా అనేక ఒడి దుడుకులు ఎదుర్కొంటున్న విలేకరులు జీత,భత్యాలు లేక కుటుంబాలకు విద్యా,వైద్యం అందించలేక ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని,లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,వంగా రవిశంకర్,వినయ్,బాబీ,మురళి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now