Site icon PRASHNA AYUDHAM

రెండు లక్షల ఉద్యోగాలుఎక్కడ…?

నిరుద్యోగులను ఏమార్చెందుకే జాబ్ క్యాలెండర్ ప్రకటన..

గజ్వెల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్

సిద్దిపేట ఆగస్టు 03 ( ప్రశ్న ఆయుధం ) :

ఉద్యోగాల కల్పన విషయంలో ఏమాత్రం స్పష్టత ఇవ్వకుండా కేవలం నిరుద్యోగులను ఏమార్చే విధంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిందని గజ్వెల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. నిరుద్యోగులను అనేక విధాలుగా భ్రమల్లో ముంచి వారిని వాడుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వాళ్ళను నట్టేట ముంచిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటికి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎనమిది నెలలు గడుస్తున్నా ఒక్క కొత్త ఉద్యోగాన్ని కల్పించలేదని అన్నారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు మంజూరి పత్రాలు ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం ఎనమిది నెలల కాలంలో ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు.నిరుద్యోగులను ఆశల పల్లకి ఎక్కించడానికి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇవ్వాళ న్యాయమైన హక్కులను కూడా కాలరాస్తూ అరెస్టులు లాఠీ చార్జీలతో నిరుద్యోగుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారని అన్నారు.అశోక్ నగర్లో, సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర తమను విశ్వసిస్తారో లేదో అని రాహుల్ గాంధీని తీసుకొచ్చి మెట్ల మీద కూర్చోబెట్టి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ అదే విషయాన్ని గుర్తు చేస్తే భరించలేక నేడు అదే నిరుద్యోగులపై ఎదరుదాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తున్నారో ఆ తేదీని, పరీక్ష వివరాలను నియామక తేదీలను సవివరంగా ప్రకటించాల్సిన జాబ్ క్యాలెండర్ లో వివరాలు ఏమి లేకుండా ప్రకటించడం నిరుద్యోగ యువతను మభ్యపెట్టడమే అవుతుందని అన్నారు.ప్రచార ఆర్భాటం తప్ప పనితనంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని అన్నారు.
సంవత్సరం కాలంలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి, తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జీలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారో స్పష్టం చేయాలని మాదాసు శ్రీనివాస్ డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అగ్రహానికి ప్రభుత్వం బలి కాక తప్పదని హెచ్చరించారు.

Exit mobile version