గత పది సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుంది..?
ఓట్లు అడగడానికి మీరు ఇదే గ్రామం వెళితే ప్రజలు పరిగెత్తించారు…… గుర్తులేదా సారు..?
మణుగూరు మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మారుస్తానని చెప్పారు.. ఎక్కడ సారు..?
10 సంవత్సరాలలో ఒక డ్రైనేజీ లేదు.. ఈ గ్రామాలకి ప్రధానంగా రోడ్డు లేదు..?
నాలుగు కిలోమీటర్ల ప్రయాణం నరకయాతన పడుతున్న ప్రజలు..? మీ వల్ల…?
పని చేసుకోవడానికి ఉపాధి హామీ లేదు..?
ఇదే ఇసుక ర్యాంపు పై ఎన్ని కోట్లు సంపాదించారు ప్రజలకు తెలియదా…?
దళిత బంధు లో కమిషన్లు తీసుకొని తీరా.. ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి రెండవ లిస్ట్ని రిలీజ్ చేస్తారు..? అంత ప్రజల్ని మాయ చేయడానికి తప్ప మీరు చేసింది ఏమీ లేదు అని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
10 సంవత్సరాలు మీ పాలనలో అదే 100 కోట్లని తెచ్చి రాయి గూడెం టు పర్ణశాల బ్రిడ్జి కట్టి ఉంటే.. ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పూజించేవారు.. అప్పుడేం చేశారు సార్..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..?