అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?
– ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న బాల కార్మికులు..!
– ఇటుక బట్టీలకు పరిమిషన్లు ఎవరు ఇస్తున్నారు..?
– ఇటుక బట్టీలను పర్యవేక్షించవలసిన అధికారులు ఎవరు ?

సరియైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇటుక బట్టీల యజమానులు తమ ఇష్టం వచ్చిన రీతిగా ఇటుక బట్టీల నిర్వహించడమే కాకుండా అందులో కూలీల సైతం చదువుకోవాల్సిన పిల్లలను పనిలో పెట్టుకుంటున్నారు. ఇటుక బట్టీల నిర్వహణకు తీసుకోవలసిన పర్మిషన్లు యజమానులు సరిగా తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వారు అనుమతి తీసుకునేది గోరంత అయితే, వారు పనులు చేసుకునేది మాత్రం కొండంత మట్టి తీసుకోవడానికి పర్మిషన్ తీసుకోరు కానీ మట్టి తెచ్చుకుంటారు. ఈ మట్టి ఇక్కడికి ఎలా వచ్చిందని ఏ అధికారి కూడా వారిని ప్రశ్నించారు ఎందుకంటే వారికి డబ్బు, రాజకీయ నాయకుల అండ ఉంటుంది. మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామం నేషనల్ హైవే పక్కన ఉన్న ఇటుక పట్టి లో మైనర్ బాల బాలికలు పనిచేస్తూ ఉండగా ఆ దృశ్యాలను ప్రశ్నాయుధం విలేకరి తన కెమెరాలో బంధించారు. ఇటుకలను తయారు చేయడమే కాదు కట్టెలను సైతం చదువుకోవాల్సిన చిన్నారుల చేతులతో గొడ్డలి పట్టుకొని కట్టెలు కొట్టడం వీటి అన్నిటిని పర్యవేక్షించిన అధికారులు ఏసీ గదుల్లో కూర్చోవడం తో ఇటుక బట్టీల యజమాన్యం హిస్టరీగా వివరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
Post Views: 31