అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడేనా..?
సెల్లార్ పర్మిషన్ లేకుండా భవనాలు..!
వాణిజ్య గోదాంలు, పెట్రోలు బంకులు!
పర్మిషన్ లేకుండా బహుళ అంతస్థులు
ప్రభుత్వ ఆదాయానికి బారి గండి..!
నియమాల్ని పరిగణలోకి తీసుకోని నిర్మాణాలు..?
అధికారులు నిద్రమత్తులోనే..!
భవిష్యత్తులో గజ్వేల్ కు గజి బిజీ తప్పదు.!
ప్రశ్న ఆయుధం సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఆగస్టు 7
గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణాల్లో అనుసరణ లేని అర్ధరాత్రి చట్టాలు రాజ్యం చేస్తుండగా, మున్సిపల్ అధికారులు కనువిప్పుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెల్లార్ పర్మిషన్ లేకుండా బహుళ అంతస్థులు, గోదాములు, పెట్రోలు పంపులు నిర్మిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుడిపాటి చేస్తుండటంతో అధికారులు నిజంగా మౌనసాధన చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పర్మిషన్ లేకుండానే నిర్మాణాలు..!
ప్రజ్ఞాపూర్ 515 సర్వే నెంబర్లో సెల్లార్ అనుమతిలేకుండానే బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. తూప్రాన్ రోడ్డుపై ఐసీఐసీఐ బ్యాంకు పక్కన పర్మిషన్ లేకుండా స్కూలు నడుస్తోంది. గతంలో యూనియన్ బ్యాంకు ఎదురుగా ఆస్పత్రి భవనాన్ని కూల్చి తర్వాత నెంబర్ ఇచ్చి మళ్లీ కట్టుకోమని మున్సిపల్ అధికారులే సూచించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రోడ్లను కబ్జా చేసినా.. రెక్కాడినా రెమ్మలేదా..?
రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పార్కింగ్ లేకుండానే ఇళ్లు కడతుంటే.. కార్లు రోడ్డుపై నిలిపి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నా చర్యలు గల్లంతవుతున్నాయి. జీప్లస్టూ పర్మిషన్‌తో బహుళ అంతస్తులు వేస్తున్నా పట్టించుకునేవాళ్లే లేరు.
చేతికి వచ్చిన చోటే అద్దె వ్యాపారం..!
కమర్షియల్ గోదాములు, పెట్రోలు బంకులు కూడా నిబంధనలతో సంబంధం లేకుండా ఏర్పాటవుతున్నాయి. సెల్లార్లు వేస్తూ యధేచ్ఛగా అద్దెకు ఇస్తున్న పరిస్థితి చట్టబద్ధతను ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, భవిష్యత్తులో శ్రమించాల్సిన పరిస్థితేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆధికారుల నిర్వీర్యతపై విమర్శలు..!
మున్సిపల్ అధికారులు కార్యాలయాల కుర్చీలకే పరిమితమై.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం మరిచిపోయారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్రమ కట్టడాల యజమానుల నుంచి లంచాలు తీసుకుంటూ సమాచారం బయటపెట్టడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. కొందరు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పని చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కమిషనర్ బలమైన మాట: చర్యలు తప్పవు.!!
మున్సిపల్ కమిషనర్ సిహెచ్. బాలకృష్ణ
“అక్రమ నిర్మాణాలు ఎవరిచేసినా సహించేది లేదు. సంబంధిత వారిపై నోటీసులు జారీ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరి ఫిర్యాదైనా పరిగణనలోకి తీసుకుని స్పందిస్తాం,” అని హెచ్చరించారు.ఒక్క మాటలో చెప్పాలంటే… అర్హతలు, అనుమతులు పక్కనపెట్టి యథేచ్ఛగా జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్ గజ్వేల్‌కు గజిబిజి తప్పదని ప్రజల హెచ్చరిక.