సమాచారమిచ్చిన స్పందించని అధికారులు.. ?
– వార్త కథనాలు కలెక్టర్కు చేరుతున్నాయా లేదా.. ?
– చేరితే కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదు..?
– మున్సిపల్ అధికారుల తీరు మారదా..?
– పరిశుభ్రత పై అధికారుల నిర్లక్ష్యం ఎందుకు.. ?
– బిల్లులు వసూలు చేయడానికి ఇంటింటికి తిరిగే అధికారులు..?
– పరిశుభ్రతపై అవగాహన ఎందుకు కల్పించరు.. ?
– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కామారెడ్డి పట్టణ ప్రజలు.. ?
ప్రశ్న ఆయుధం ఆగష్టు 8కామారెడ్డి
గత నాలుగైదు రోజులుగా పట్టణంలో చెత్త పేరుకుపోవడం డ్రైనేజీల్లో ప్లాస్టిక్ ఇతర వ్యక్తాలు పడి నీరు నిలబై దోమలు వృద్ధి చెందడం తదితర విషయాలపై పత్రికలో వార్తా కథనము వచ్చిన ఇంతవరకు అటు జిల్లా కలెక్టర్ కని, ఇటు మునిసిపల్ అధికారులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ విద్యానగర్ ఇతర కాలనీలలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా చెత్త డంపును మరిపించేటట్లుగా గుట్టలు గుట్టలుగా పట్టణ నడిబొడ్డులో పేరుకపోతున్న దానిని అధికారులు అడుపదాడపా తొలగిస్తున్నారు తప్ప దాని శాశ్వత నివారణ కోసం ప్రయత్నాలు చేయడం లేదు. కామారెడ్డి పట్టణంలో ఇప్పటివరకు చెత్త రోడ్లపై వేసిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో చెత్త బండి అక్కడి నుంచి వెళ్లిన మరుక్షణం వచ్చి బయట రోడ్లపై చెత్త వేస్తున్నారే తప్ప చెత్త బండిలో వేయడం లేదు. దీంతో పట్టణం దుర్గంధ పట్టణంగా మారుతుంది.
అధికారులకు పరిశుభ్రతపై నిర్లక్ష్యం ఎందుకు..?
ప్రజల డబ్బుతో వేతనాలు తీసుకునే అధికారులు ప్రజలకు సేవ చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు సామాన్య ప్రజలు సైతం పన్నుల రూపంలో డబ్బులను వేతనాలుగా తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు మరి ప్రజల బాగోవులను ఎందుకు పట్టించుకోరు అనే చర్చ జరుగుతుంది. వారికి వేతనాలు వస్తే వారి కుటుంబం బాగుంటే సరిపోతుందా.. ? వారికి వేతనాలు ఇచ్చే ప్రజలు ఏమైనా పర్వాలేదా.. ? కనీసం భవ పరిశుభ్రతపై దృష్టి పెట్టని ఈ అధికారులు వాళ్ల విధులను ఎలా నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది.
కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదు.. ?
వార్తాపత్రికలలో ఏ వార్త వచ్చినా స్పందించే జిల్లా కలెక్టర్ గత మూడు నాలుగు రోజుల నుండి వివిధ పత్రికల్లో వస్తున్న ఈ అప్రశుభ్రత వాతావరణం పై ఎందుకు స్పందించడం లేదనేది కామారెడ్డి పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుపుకోండి తొందరగా అని చెప్తున్నా అధికారులు ఆ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించకపోవడం, పట్టణంలో అపరిశుభ్రంగా మారుతున్న చెత్తచెదారాన్ని వేయకుండా కట్టడి చేయలేకపోతున్నారు.