*భారత్, పాకిస్తాన్ బలాబలాలు.. యుద్ధం వస్తే ఎవరు కింగ్..*
భారత్, పాకిస్తాన్‌ల మధ్య గత కొద్దిరోజుల నుంచి యుద్ధ వాతావరణం నడుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూభాగంలోకి వచ్చి.. 100 మంది ఉగ్రవాదులను చంపటాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. భారత్‌పై ప్రతీకార జ్వాలలతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌పై రెట్టించి దాడులకు పాల్పడే అవకాశం కనిపిస్తుంది. ఒక వేళ భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగితే.. గెలుపు ఎవరి సొంతం అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ, పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కొన్ని విషయాల్లో ఇండియాకు పోటీగా.. మరికొన్ని విషయాల్లో ఇండియాను మించి బలంగా ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విషయంలో భారత్, పాకిస్తాన్ బలాబలాలపై ఓ లుక్ వేద్దాం.
గ్లోబల్ ఫైర్ పవర్.కామ్ వివరాల ప్రకారం.. ఇండియా, పాకిస్తాన్ దేశాల త్రివిధ దళాల బలాలు.
గ్లోబల్ పవర్ ఇండెక్స్
గ్లోబల్ పవర్ ఇండెక్స్‌లో 2025 లెక్కల ప్రకారం భారత్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక, పాకిస్తాన్ విషయానికి వస్తే పవర్ ఇండెక్స్‌లో 12వ స్థానంలో ఉంది.
ఆర్మీపై ఖర్చు
దేశ రక్షణలో భాగంగా.. భారత్ ఆర్మీపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. గత సంవత్సరం 2024లో 86 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఇది దేశ జీడీపీలో 2.3 శాతం కావటం విశేషం. ఇక, పాకిస్తాన్ విషయానికి వస్తే 2024లో 10.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
సైనికుల సంఖ్య
భారత ఆర్మీలో 5,137,550 మంది సైనికులు ఉన్నారు. పాక్ సైన్యంతో పోల్చుకుంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఇక, పాకిస్తాన్ ఆర్మీలో 1,704,000 మంది సైనికులు ఉన్నారు.
మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్స్
ఇండియా దగ్గర ఏకంగా 2,229 మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి.
కాంబాట్ ట్యాంక్స్
ఇండియా దగ్గర 3,151 కాంబాట్ ట్యాంక్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 1,839 కాంబాట్ ట్యాంక్స్ మాత్రమే ఉన్నాయి.
నేవీ కవర్ ఏరియా
భారత నావికా దళం 6,100 కిలోమీటర్ల పొడవైన సముద్ర సరిహద్దు ప్రాంతాలను కవర్ చేస్తోంది. ఏకంగా 293 నేవీ వాహనాలు సముద్రంలో పహారా కాస్తున్నాయి. ఇక, పాకిస్తాన్ విషయానికి వస్తే. 1,046 కిలోమీటర్ల పొడవైన అరేబియన్ సముద్రంలోని దక్షిణ సముద్ర సరిహద్దు ప్రాంతాన్ని కవర్ చేస్తోంది. ఇక్కడ 121 నేవీ వాహనాలు పహారా కాస్తున్నాయి.
అణ్వాయుధాలు
ఇంటర్ నేషనల్ క్యాంపేన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ ప్రకారం.. 2023లో అణ్వాయుధాల కోసం భారత్ ఏకంగా 2.7 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. పాకిస్తాన్ 1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఇండియా దగ్గర దాదాపు 180కి పైగా అణ్వాయుధాలు ఉంటే.. పాకిస్తాన్ దగ్గర 170కిపైగా అణ్వాయుధాలు ఉన్నాయి.
హెలికాఫ్టర్లు
ఇండియా దగ్గర 899 హెలికాఫ్టర్లు ఉండగా.. పాకిస్తాన్ దగ్గర 373 హెలికాఫ్టర్లు ఉన్నాయి.
అటాక్ హెలికాఫ్టర్లు
ఇండియా దగ్గర 80 ఉండగా.. పాకిస్తాన్ దగ్గర 57 ఉన్నాయి.
యుద్ధ ట్యాంకులు
ఇండియా దగ్గర 4,201 ఉండగా.. పాకిస్తాన్ దగ్గర 2,627 ఉన్నాయి.
యుద్ధ వాహనాలు
ఇండియా దగ్గర 1,48,594 యుద్ధ వాహనాలు ఉండగా.. పాకిస్తాన్ దగ్గర కేవలం 17,516 మాత్రమే ఉన్నాయి.
సెల్ఫ్ ప్రొపెల్లెడ్ ఆర్టిలరీ
ఇండియా దగ్గర 100 దాకా సెల్ఫ్ ప్రొపెల్లెడ్ ఆర్టిలరీ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 662 దాకా ఉన్నాయి.
టోవ్డ్ ఆర్టిలరీ
ఇండియా దగ్గర 3,975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2,629 ఉన్నాయి.
మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్స్
ఇండియా దగ్గర 264.. పాకిస్తాన్ దగ్గర 600 ఉన్నాయి.
ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్
ఇండియా దగ్గర 2 ఉండగా..పాకిస్తాన్ దగ్గర ఏమీ లేవు.
సబ్‌మెరైన్స్
ఇండియా దగ్గర 18 సబ్‌మెరైన్స్ ఉండగా.. పాకిస్తాన్ దగ్గర 8 మాత్రమే ఉన్నాయి.
డెస్ట్రాయర్స్
ఇండియా దగ్గర 13 డెస్ట్రాయర్స్ ఉండగా.. పాకిస్తాన్ దగ్గర ఏమీ లేవు.
ఫ్రిగేట్స్
ఇండియా దగ్గర 14 ఫ్రిగేట్స్ ఉండగా.. పాకిస్తాన్ దగ్గర 9 మాత్రమే ఉన్నాయి.
కర్వెటిస్
ఇండియా దగ్గర 18 ఉండగా.. పాకిస్తాన్ దగ్గర 9 ఉన్నాయి.
పాట్రోల్ వెసెల్స్
ఇండియా దగ్గర 135 పాట్రోల్ వెసెల్స్ ఉండగా.. పాకిస్తాన్ దగ్గర 69 మాత్రమే ఉన్నాయి.
మైన్ వార్‌ఫేర్
పాకిస్తాన్ దగ్గర 3 ఉండగా.. ఇండియా దగ్గర ఒక్కటి కూడా లేదు.
ఎయిర్‌పోర్టులు
ఇండియాలో 311 ఎయిర్‌పోర్టులు ఉండగా.. పాకిస్తాన్‌లో 116 మాత్రమే ఉన్నాయి.
మర్చంట్ మెరైన్లు
ఇండియాలో 1,859 మర్చంట్ మెరైన్లు ఉండగా.. పాకిస్తాన్‌లో 60 మాత్రమే ఉన్నాయి.
పోస్టు, టర్మినల్స్
భారత్‌లో 56 ఉండగా.. పాకిస్తాన్‌లో 3 మాత్రమే ఉన్నాయి..