తప్పు చేయకపోతే.. కేటీఆర్ విచారణకు ఎందుకు భయపడుతున్నాడు…

*తప్పు చేయకపోతే.. కేటీఆర్ విచారణకు ఎందుకు భయపడుతున్నాడు…*

*మంత్రి పొన్నం ప్రభాకర్*

ఎఫ్ఐఆర్ అయిందనే భయంతో అసెంబ్లీలో చర్చించాలని అంటున్నాడు…?

తప్పు జరగకపోతే ఏసీబీ ముందే ఆయన నిజాయితీని నిరూపించుకోవాలి.

ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో మొదటిసారి నిర్వహించినప్పుడే దాదాపు రూ.200 కోట్లు నష్టం వచ్చింది. దీంతో హెచ్ఎండిఏ కూడా నష్టపోయింది.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరిగిందా.. లేదా.. ట్యాంక్ బండ్, ఐమాక్స్ చుట్టూ సిటీ ప్రజలు ఇబ్బంది పడ్డారా… అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. అందులో గొప్పలు చెప్పుకుంటే తెలంగాణలోని నాలుగు కోట్ల మంది జనం కూడా నవ్వుకుంటారు.

మొదటిసారి ఫార్ములా ఈ తో భారీగా నష్టం జరిగిందని అప్పటి ప్రభుత్వానికి తెలుసు. అందుకే రెండోసారి ప్రమోటర్ కూడా ముందుకు రాలేదు. అవన్నీ తెలిసినప్పటికీ హెచ్ఎండిఏ వైస్ ఛైర్మన్ గా ఉన్న కేటీఆర్ ఎందుకు రూ.55 కోట్లు చెల్లించారు.. అవి ప్రజాధనమని మరిచిపోయాడా..? లేదా అవి ఆయన సొంత డబ్బులా..?

అధికారం ఉంది కదా.. అని దుర్వినియోగం చేయటంతో పాటు.. మళ్లీ అధికారంలోకి వస్తామనే అహంకారంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది నిజం కాదా..?

హెచ్ఎండిఏ డబ్బును ఎవరి అనుమతి లేకుండా వాడుకునే వీలుందా..? డబ్బులు బదిలీ చేసేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు..? అప్పటి మంత్రివర్గంలో చర్చ జరిగిందా..? అప్పటి ముఖ్యమంత్రి ఆమోదించారా..? ఆర్థిక శాఖ అనుమతి ఉందా..? అసలు ఎవరి అనుమతి లేకుండా విదేశాలకు తెలంగాణ ప్రభుత్వం డబ్బును ఎలా బదిలీ చేశారు..?

మంత్రులయితే.. అధికారంలో ఉంటే.. నిబంధనలు పాటించాలనే కనీస ధర్మం పాటించవద్దా..? ప్రజాధనమంటే అంత చులకనా..?

అక్టోబర్ 5వ తేదీన, అక్టోబర్ 11వ తేదీన ఎఫ్ ఐ ఏ కు డబ్బులు బదిలీ చేసినట్లు బాహాటంగా చెప్పుకుంటున్న కేటీఆర్ కు అప్పుడు ఎన్నికల షెడ్యూలు విడుదలైన విషయం తెలియదా..? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు డబ్బుల చెల్లింపులు చేయటం నేరం కాదా..?

Join WhatsApp

Join Now