ఓ మనిషి..రాకడ ఎందుకు..? పోకడ ఎందుకు..?
రాకడ పోకట యొక్క మర్మము తెలుసుకొని మెసులుకో…
నాది, నాది అంటూ వెంపర్లాడుతుంటావు..ఇది నాదే,అది నాదే ఇదంతా నా కష్టార్జితమే అని విర్రవీగుతావు. నీదనేది ఏదుందిఈ లోకంలో..? ముందు తెలుసుకో…
నీ దేహమే ఒక అద్దె కొంప.. ఏదో ఒక రోజు ఈ దేహం అనే కొంపను ఖాళీ చేయక తప్పదు ముందు గుర్తెరుగు…
నీ కుటుంబ పరివారము,బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులను చూసి.. ఇంతమంది ఉండగా నాకేమీ లోటు అని సంబర పడతావు కదా!
ఇంతకు నీ పరివారం, బంధుగణం, స్నేహితులు అందరూ నీ చుట్టారా.. ఉండగానే మాయమైపోతావు… నీవనుకున్న వీరందరూ నిన్ను రక్షించారా!
నాది,నాది అన్న నీ దేహమే నీ మాట వినకుండా నిన్ను బయటకు గెంటేస్తుందే…
అలాంటిది ఈ దేహం పై మమకారం ఎలా..? దేహాభిమానాన్ని వదిలి,మనిషిలాగా ప్రవర్తించు, మానవత్వాన్నినర నరాల్లో జీర్ణించుకో..వారేంటి, గ్యారెంటీ లేని ఈ దేహాన్ని చూసిమొహమేల..?_*
అందుకే..నీ ముందున్న భోగాలన్నీ కేవలం నీవున్నంతవరకు అనుభవించడానికి మాత్రమే!
ఈరోజు నీది అన్నది రేపు వేరొకడి సొంతం. నీ ముందున్నదంతా మాయేసుమా… ఇదంతా సప్నం లాంటిది… క్షణిక సుఖములాంటిది..
స్వప్నంలో ఎన్నో రకాల రాజభోగాలను చవిచూస్తావు, అనుభవిస్తావు. తీరా..కళ్ళు తెరవగానే అన్నీ మాయమవుతాయి.. కదా! అదేవిధంగా ఈ లోకంలో నీది అనేది ఏదీ లేదు అంతా నీ బ్రమనే!
నిజానిజాలు గ్రహించు,మాయ నుండి బయటపడు.మాయల వలలో చిక్కి సతమతం అవ్వకముందే.. జ్ఞానాన్ని గ్రహించు. ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకో.. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం దైవాన్ని తెలుసుకోవడమే..
కేవలం నీ వనుకున్నదే నిజం అనుకుంటే…
ప్రపంచాన్ని పాలించిన చక్రవర్తులేరి..?
సర్వమనుకున్నా నీ ఆత్మీయులేరీ..?
నీ తాత ముత్తాత లేరి..?
ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారే కదా!అలాంటప్పుడు ఏదీ శాశ్వతం.తెలుసుకుంటే..అంతా ఆశాశ్వతం..
ఇంతకు నీవు ఎన్నాళ్ళు ఉంటావు..? ఏదైనా అగ్రిమెంటు, లేదా ఇంతకాలం ఉంటా..అనే బాండు ఏదైనా నీ వద్ద ఉందా! శశిరంగా శాశ్వతంగా ఉంటావా..?
అందుకే.. గర్వము, అహంకారము,చిన్న పెద్ద అనే బెదాన్ని వదిలి.ఉన్నంత వరకు అందరికి ప్రేమను పంచు.. ప్రేమతో పలకరించు.ఇదే నీవు మనిషిగా పుట్టినందుకు అంతిమకర్తవ్యం.☝🏾