ఎంపీడీవో రామిరెడ్డిపై చర్యలు ఎందుకు లేవు..?

తిమ్మాపూర్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి..

గ్రామ కార్యదర్శినే టార్గెట్‌ చేయడం కులవ్యవక్షతేనా?

విషజ్వరాలు, డెంగ్యూతో ప్రజల ఆందోళన – ఇద్దరు మృతి

కలెక్టర్ ఆదేశాలతో గ్రామ కార్యదర్శి సస్పెన్షన్

“కిందిస్థాయి ఉద్యోగి దళితుడు కాబట్టే బలి పశువా?” – గ్రామస్థుల ప్రశ్న

ఎంపీడీవో రామిరెడ్డిపై చర్యలు ఎందుకు లేవు?

అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్‌కు గ్రామస్థుల వినతిపత్రం

సిద్దిపేట, సెప్టెంబర్ 1 (ప్రశ్న ఆయుధం):

జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో విషజ్వరాలు, డెంగ్యూతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ జ్వరాల కారణంగా ఇద్దరు మరణించగా, పారిశుద్ధ్య లోపాలపై కలెక్టర్ గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. అయితే గ్రామస్థులు ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

గ్రామస్థుల వాదన ప్రకారం—“గ్రామ కార్యదర్శి దళితుడు కాబట్టి ఒక్కరినే బాధ్యునిగా నిలిపారు. అసలు బాధ్యత కలిగిన స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో రామిరెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది కులవ్యవక్షత కిందకు వస్తుంది” అని వారు ఆరోపించారు.

ఈ నేపధ్యంలో గ్రామస్థులు జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్‌కు వినతిపత్రం అందజేశారు. “విషజ్వరాల ప్రభావంతో గ్రామంలో భయభ్రాంతులు నెలకొన్నాయి. ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేసి కొన్నిరోజులు పర్యవేక్షణ కొనసాగించాలి. ఎంపీడీవో బాధ్యత తప్పించుకోలేడు, అతని పై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి” అని వారు డిమాండ్ చేశారు.

గరీమ అగర్వాల్ స్పందన:

“మీ వినతిని స్వీకరించాను. సమగ్ర విచారణ చేపట్టి, ఎవరు బాధ్యులో వారిపై చర్యలు తప్పవు. డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నాం. అవసరమైన ఎస్టిమేషన్ అధికారుల ద్వారా వేయిస్తున్నాం. విషజ్వరాలపై సేకరించిన శాంపిల్స్ ఢిల్లీకి పంపించాం. నివేదికలు వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తిమ్మాపూర్‌లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి, ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తాం” అని గరీమ అగర్వాల్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పోసానిపల్లి రాజు, గ్రామానికి చెందిన పోసానిపల్లి సాయిలు, గుండ్రు సుదర్శన్, పోసానిపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment