Site icon PRASHNA AYUDHAM

మద్యం వ్యసనంతో భర్త చేతుల్లో భార్య హత్య

మద్యం

మహారాష్ట్రలోని బీల్కొని గ్రామం బిలోలి తాలూకా నాందేడ్ జిల్లా కి చెందిన జంగా శివకళ భర్త పేరు రాజు గంగారం జంగ వయస్సు 30 సంవత్సరాలు కులం మున్నేరు వారు వృత్తి వ్యవసాయ కూలీ అను గత సంవత్సరన్నార నుండి బ్రతుకుతెరువు కోసం తన భర్తతో కలిసి వన్నెల్ బి గ్రామంలో ఉంటూ వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. శివకళ యొక్క భర్త రాజు గంగారం కొంతకాలంగా మద్యానికి బానిసై రోజు తాగుతూ, శశికళతో గొడవ పడుతూ ఉండేవాడు.

అదేవిధంగా గత రాత్రి అనగా తేదీ 07.12.2024 మరియు తేదీ 8.12.2024 నాడు మధ్య రాత్రి సమయంలో రాజు గంగారం తన భార్య శివకళను ఏదో పదునైన ఆయుధంతో తలపై కొట్టి ఆమెను చంపి ఎక్కడో పారిపోయినాడు అని మృతురాలు తల్లి లింగం పిరాజీ రాధాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తేది 9.12.2024 రోజున నిందితుడిని పట్టుకొని రిమాండ్ కి తరలించనైనది.

Exit mobile version