యూట్యూబ్‌లో చూసి భర్తను ఎలా చంపాలో ప్రియుడికి చెప్పిన భార్య
మద్యం తాగించి..చెవిలో పురుగుల మందు పోసి హత్య చేసిన ప్రియుడు
అనంతరం భర్త కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తూ తన భార్య రమాదేవి, ఇరవై ఏళ్ళ వయసు దాటిన కొడుకు, కూతుర్లను పోషిస్తున్న సంపత్(45)
భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండగా, తరచూ ఆమె వద్ద సర్వపిండి కోసం వచ్చి పరిచయం పెంచుకున్న కర్రె రాజయ్య(50)
వీరి పరిచయం వివాహేతర సంబంధంగా మారడంతో ఎలాగైనా సంపత్ అడ్డు తొలగించుకోవాలని యూట్యూబ్‌లో చూసి పథకం వేసిన భార్య రమాదేవి
ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్‌లో చూసి అదే పద్ధతిలో హత్య చేయాలని ప్రియుడికి సూచించిన రమాదేవి
పార్టీ చేసుకుందామని పిలిచి బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద సంపత్‌తో కలిసి మద్యం సేవించిన రమాదేవి ప్రియుడు రాజయ్య అతని స్నేహితుడు శ్రీనివాస్
మద్యం మత్తులో తూలుతూ కింద పడిపోగానే చెవిలో గడ్డి మందు పోసి, అతను చనిపోగానే రమాదేవికి ఫోన్ చేసి సంపత్ చనిపోయాడని తెలిపిన రాజయ్య
మరుసటి రోజు భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆగస్టు 1వ తేద