గూగుల్‌లో వెతికి మరీ కర్ణాటక మాజీ డీజీపీని హత్య చేసిన భార్య, కూతురు..!!
హత్యకు 5 రోజుల ముందు నుండే మనిషికి ఎక్కడ నరాలు తెగితే చనిపోతాడో గూగుల్‌లో వెతికిన ఓం ప్రకాశ్ భార్య పల్లవి..
ఓం ప్రకాశ్‌ను చంపేశాక దుర్మార్గుడిని చంపేశా అంటూ వాట్సాప్ లో పలువురికి మెసేజ్ చేసిన పల్లవి..
ఓం ప్రకాశ్ తనను, తన కూతురిని హింసించాడని, తమను ఒక గదిలో బంధించి ఉంచాడని పోలీసుల విచారణలో తెలిపిన పల్లవి..
ఓం ప్రకాశ్ తన కొడుకుతో, తన చెల్లితో ఎక్కువగా ఉండేవాడని.. దండేలి వద్ద ఉన్న 17 ఎకరాల భూమిని కూడా కొడుకు, చెల్లికి చేయాలని అనుకున్నాడని తెలిపిన భార్య..తమను తీవ్రంగా హింసించడం, ఆస్తిలో వాటా ఇవ్వకపోవడంతో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను హత్య చేసిన భార్య పల్లవి, కూతురు కృతి..!!