అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కటిన చర్యలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ (ప్రశ్నఆయుధం) జూలై 29
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోనీ ఎరువుల, పురుగు మందుల దుకాణాలను తహశీల్దార్ దశరథ్, ఎస్ఐ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మండల అధికారి కిషన్ తనిఖీ చేసారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.యూరియా కొరత లేదని ఏవో స్పష్టం చేశారు. సుమారు 2,000 బ్యాగులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.