అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు!
ప్రశ్న ఆయుధం 23జులై హైదరాబాద్ :
అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు!
గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాలకు శస్త్రచికిత్స కారణంగా మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో.. ఈ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాసనసభకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది