*నేడు పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు!: సభలో నెగ్గుతుందా?*
*అధికార విపక్షాల బలాలేంటి?*
హైదరాబాద్: ఏప్రిల్ 02
దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీ యాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు ఇవ్వాళ పార్లమెంటు ముందుకు రానుంది. మొదట లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును పెట్టి చర్చించ నున్నారు.
ఆ తర్వాత ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపె ట్టేందుకు అధికార ఎన్డీఏ కూటమి సిద్ధం అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూటమి పార్టీల ఎంపీలకు విప్ జారీ చేసింది. 3 రోజు ల పాటు అందరు ఎంపీలు తప్పకుండా సభకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చిం ది. మరోవైపు.. ఈ వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకిస్తోంది.
ఈ క్రమంలోనే ఇండియా కూటమిలోని పార్టీలు.. ఈ బిల్లును అడ్డుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అటు.. ఇండియా కూటమి పార్టీలు కూడా తమ ఎంపీలు తప్పక సభకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇక లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ కూటమికి సరిపడా బలం ఉండటంతో.. ఏదైనా జరిగితే తప్ప ఈ బిల్లు ఆమోదం పొందడం తథ్యంగా కనిపిస్తోంది.
బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ఈ వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ముందు రానున్న నేపథ్యం లో తమ తమ ఎంపీలు సభకు కచ్చితంగా హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విప్‌లు జారీ చేశాయి.
బుధవారం నుంచి 3 రోజుల పాటు సభలకు కచ్చితంగా రావాలని తమ ఎంపీలను ఆదేశించాయి. ప్రస్తుతం అటు లోక్‌సభ ఇటు రాజ్యసభల్లో అధికార ఎన్డీఏ కూటమికి ఫుల్ మెజారిటీ ఉంది.