ఖగోళంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. ఈ మార్పులు చందమామను మనకు దూరం చేస్తున్నాయని పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో ఓ అంచనాకు వచ్చారు. సమజ ఉపగ్రహం నెమ్మదిగా భూమికి దూరమవుతోందని తాజా పరిశోదన సూచించింది.విస్కాన్సిన్ – మాడిసన్ విశ్వ విద్యాలయంలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఒకటి 90 మిలియన్ సంవత్సరాల వయస్సులో ఏర్పడిన శిలలపై దృష్టి సారించింది. భూమి నుంచి చంద్రుడు క్రమంగా దూర మవుతున్న గణనీయమైన ప్రభావాలను ఈ శిల కలిగి ఉందని గుర్తించింది. చంద్రుడు ఏడాదికి సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమి నుంచి దూరం జరుగుతున్నాడు. ఇది మనగ్రహం మీద కాలయానాన్ని ప్రభావితం చేస్తుందని ఈ అద్యయనం చెప్పింది. రాబోయే 200 మిలియన్ సంవత్సరాల్లో భూ గ్రహంపై కాలమానంలో మార్పు జరుగనుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం రోజుకు 24 గంటలుగా ఉన్న కాలమానం.. భవిష్యత్ లో 25 గంటల నిడివి కలిగిన రోజు వస్తుందని ఈ బృందం వెల్లడించింది..