జిల్లా ప్రజలకు న్యాయం జరిగేనా?
ఇప్పుడైనా నిజమైన సర్వే చేయండి
నిజమైన లబ్ధిదారులను గుర్తించండి
గతంలో డాటా ఎంట్రీ తప్పులతడాక
ఇప్పటికీ అందని ప్రభుత్వ ఫలాలు
క్షేత్రస్థాయి పరిశీలన సమగ్ర వివరాలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో సేకరించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,ఆహార భద్రత( రేషన్) కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన వారికి అందజేయాలని ప్రజలు కోరుచున్నారు. గతంలో సేకరించిన వివరాలను క్రమ పద్ధతిలో నమోదు చేయకపోవడంతో నిరుపేదలు అన్యాయనికి గురి అయ్యారు.డాటా ఎంట్రీ సమయంలో పొరపాట్లు జరిగాయి. అతి పేదవారికి ఇప్పటికి గ్యాస్ సబ్సిడీ డబ్బులు అందడం లేదు. అలాగే నిజమైన జర్నలిస్టులకు అక్రిడీటే షన్ కార్డులు జారీ విషయంలో సరిదిద్దుకోలేని పొరపాటు చేశారు. నిజమైన జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డులు అందలేదు. పైరవి చేసుకున్న వారికీ, అర్హత లేని వారికీ ఇచ్చారు.కలెక్టర్ ఎన్ని కీలక సూచనలు చేసిన క్రింది స్థాయి ఉద్యోగులు పెడ చెవిన పెడుతున్నారు. జిల్లాలో నిజమైన లబ్ధిదారులు అన్యాయానికి గురైనారు.ఇప్పుడు జరిగే సర్వేలోనైనా పొరపాట్లు దొర్ల కుండా, అవినీతికి తావివ్వకుండా పేదవారికి న్యాయం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అధికారులు ఉన్నట్టా లేనట్టా? లేక ఉన్న లేనట్టేనా అని స్థానికులు గుస గుస లాడుతున్నారు.