విద్యారంగ సమస్యలకోసం కృషి చేస్తా

కృషి
Headlines in Telugu:
  • విద్యారంగ సమస్యలపై కృషి చేస్తా: హర్ష వర్ధన్ రెడ్డి
  • ఒక్కసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి: ఉపాధ్యాయుల కోసం పని చేస్తా
  • 10 నెలలలో విద్యా రంగ సమస్యలు పరిష్కారం: పి.ఆర్.టి.యు అధ్యక్షుడు

ఒక్కసారి ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వండి ఉపాద్యాయ , విద్యారంగ సమస్యలకోసం కృషి చేస్తా

పి.ఆర్.టి.యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి

ఖమ్మం : రాష్ర్టంలో గత 10 సంవత్సరాల నుండి విద్యా రంగ పరంగా ఎలాంటి సమస్య పరిష్కరించబడలేదు . కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 10 నెలల కాలంలోనే అనతికాలంగా పెండింగ్ లో ఉన్న పండిత పిఈటిల అప్ గ్రేడేషన్ అలాగే బదిలీలు అన్ని కేటగిరీల పదోన్నతులు ఆఖరికి మిగిలిపోయిన పదోన్నతులకు కూడా లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలను నింపడం జరిగింది . ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్న గత రెండు దశాబ్దాల కాలం నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా కొట్లాడి ఉపాధ్యాయుల పక్షాన నిస్వార్ధంగా పోరాడుతున్న నాకు ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశాన్ని కల్పిస్తే చట్టసభల్లో విద్యారంగానికి పటిష్టపరిచేందుకు ఎలాంటి సమస్య ఉన్న పరిష్కరించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు . అందుకోసము మొట్టమొదటగా ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరు ఫారం 19 ద్వారా ఆన్లైన్లో గాని ఆఫ్ లైన్ లో గాని ఈ నవంబరు ఆరవ తేదీ లోపల అప్లై చేసుకోవాల్సిందిగా కోరినారు . స్థానిక సంతోష్ హోటల్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు కొమ్మినేని అనిల్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పిఆర్టియు తెలంగాణ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. తనను ఎమ్మెల్సీ గా ఎందుకు ఎన్నుకోవాలో తన ఏజెండ ఏమిటో తెలియజేశారు .. వాటిలో వచ్చే జూన్ వరకు ఉపాధ్యాయులందరికీ సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయించి నేడు స్కూల్ అసిస్టెంట్లుగా రిటైర్ అవుతున్న ఉపాధ్యాయులకు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఎంఈఓ లు డిప్యూటీ డిఈఓ లు జే యల్ లాంటి ప్రమోషన్లు కల్పించేందుకుగాను కృషి చేస్తాను . సి పి ఎస్ విధానాన్ని శాసనమండలిలో ప్రస్తావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ విషయం మీద విన్నవించి అవసరమైతే చట్ట సవరణలు కాని ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో మేనిఫెస్టో లో పెట్టించిన అంశాన్ని ప్రస్తావించి వాళ్ళందరికీ ఓపిఎస్ ఇప్పించేందుకు శక్తి వంచన లేకుండా కష్టపడతా . 3:17 జీవోను రద్దు చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించిన విధంగా వెంటనే సాధ్యాసాధ్యాలు అనే కాలయాపన లేకుండా ఉన్నటువంటి ఉపాద్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు స్వాంతన చేకూరేలా వారందరికీ స్థానికతను పొందేందుకు శ్రమిస్తాను . ఎస్ ఎస్ ఏ కింద ఉన్నటువంటి అన్ని క్యాడర్లకు కేజీబీవీలకు సీసీఓలకు పిటిఐ లకు గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అందరికీ అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సి ఆర్ టి లకు గెలిచిన వెంటనే ఎం టి ఎస్ ఇప్పించేందుకు కృషి చేస్తాను . మిగిలిపోయిన భాషా పండితులు పీఈటీలకు వెంటనే మిగిలిన పోస్టులకు అప్ గ్రేడేషన్ చేయించి పదోన్నతులు ఇప్పిస్తాను . అంతేకాకుండా ఉపాధ్యాయ సమస్యలలో సంఘాల కతీతంగా ఎవరూ నా దగ్గరకు వచ్చిన ఇప్పటివరకు వారి కోసం కష్టపడ్డాను పడతాను అలాగే వారికోసం నెలకు జిల్లా చొప్పున జిల్లా ముఖ్య కేంద్రంలో అందుబాటులో ఉండి వారి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాను అన్నారు . ఇట్టి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి , పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బాలాజీ నాయక్ , రాష్ట్ర నాయకులు ఓం ప్రకాష్ , అలాగే మిర్యాలగూడ నాయకులు , టీ ఎస్ టీ టీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ , పి ఈ టి అసోసియేషన్ బాధ్యులు నాగుల్ మీరా , పి ఆర్ టి యు జిల్లా గౌరవాధ్యక్షులు మట్టా శ్రీనివాసరావు , జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తినేని సురేష్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శిరీష , 317 బాధితుల నుంచి దుబాకుల శ్రీనివాస్ , పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర నాయకులు పోట్ల నాగేశ్వరరావు , భద్రాద్రి జిల్లా బాధ్యులు జావేద్ మియా , కూచిపూడి దేవేందర్ , గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ , పిటి ఐ ల సంఘం అధ్యక్షులు సైదులు , సీసీఓల సంఘం అధ్యక్షులు సత్యవతి , ఎం ఆర్ సి ఓఎస్ల సంఘం అధ్యక్షులు బాబు , 98 క్వాలిఫై టీచర్ల సంఘం నాయకులు ఉమామహేశ్వరరావు అలాగే వివిధ సంఘాల బాధితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now