ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించండి – గర్నేపల్లి కృష్ణమూర్తి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించండి – గర్నేపల్లి కృష్ణమూర్తి

సిద్దిపేట జిల్లా, 16 ఫిబ్రవరి 2025 :

ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి చిన్నమైల్ డాక్టర్ అంజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బిజెపి ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి కృష్ణమూర్తి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపిస్తే గ్రాడ్యుయేట్లకి విద్య, ఉపాధి, సంక్షేమంతోపాటు బంగారు భవిష్యత్తుకు భరోసా, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాలకు చేయూత, స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, ఉద్యోగ భద్రత నిరుద్యోగ నిర్మూలనాకు ప్రాధాన్యం గ్రాడ్యుయేట్ల సంక్షేమం మరియు భద్రతకు పెద్దపీట వేస్తామని అన్నారు. ఉద్యోగుల హక్కులకై పోరాటం, న్యాయవాదుల సంక్షేమానికి కృషి, వైద్య రంగ అభివృద్ధికి భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. జరుగనున్న ఎన్నికలలో గ్రాడ్యుయేట్ లందరూ మొదటి ప్రాధాన్యత ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

Join WhatsApp

Join Now