సిపిఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
సందబోయిన ఎల్లయ్య
సిపిఐ ఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
గజ్వేల్ డిసెంబర్ 19 ప్రశ్న ఆయుధం :
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుండి 28 వరకు మహాసభలు విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య పిలుపునిచ్చారు గజ్వేల్ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహాసభల కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కార్మికులు ఉద్యోగులు రైతుల వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నదని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతతత్వ విచ్ఛిన్నకర విధానాలు అమలు జరుపుతూ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ పాలన నిర్వహిస్తున్నదని విమర్శించారు భారత రాజ్యాంగం,ప్రజాస్వామ్యం లౌకికవాదం, సార్వభౌమత్వంపై దాడి చేస్తున్నదని అన్నారు తినే ఆహార పదార్థాల పైన, వస్త్ర వేషధారణ పైన, దాడి చేస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను దాడి చేస్తున్నదని అన్నారు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకుని వచ్చి రైతాంగ పోరాటంతో మరలా రద్దు చేసిందని అన్నారు నేడు మరల మార్కెట్ బిల్లుల రూపంలో దొడ్డిదారున అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని అన్నారు ప్రజలపై విద్యుత్ భారం మోపాలని చూస్తున్నదని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నదని అన్నారు. కార్మికుల చట్టాలు రద్దు చేసిందని, యజమానియాలకు అనుగుణంగా నాలుగు రూల్స్ ఫ్రేమ్ చేసిందని అన్నారు రాష్ట్ర మహాసభల్లో ప్రజా సమస్యలు, ప్రజలపై భారాలు కార్మిక, ఉద్యోగ, రైతాంగ, యువకులు, మహిళలు, దళితుల గిరిజనుల సమస్యలపై చర్చ చేయడం జరుగుతుంది అని ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొంటారని మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బండ్ల స్వామి, రంగారెడ్డి , వెంకటాచారి పాల్గొన్నారు.