నిజామాబాదు లో రేపటినుంచి వైన్ షాపులు, బార్లు బంద్

రేపటినుంచి వైన్ షాపులు, బార్లు బంద్

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం), సెప్టెంబర్ 3

గణేష్ నిమజ్జన వేడుకల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు మూసివేత ఆదేశాలు

ఎక్సైజ్ చట్టం 1968 సెక్షన్ 20(1) ప్రకారం నోటీసు జారీ

సెప్టెంబర్ 4 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 5 ఉదయం 6 గంటల వరకు బంద్ పోలీస్ కమిషనర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సాయి చైతన్య, IPS సీరియస్ వార్నింగ్ నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ

గణేష్ నిమజ్జనాల సందర్భంగా శాంతి భద్రతలు దృష్ట్యా నిజామాబాద్ జిల్లాలోని అన్ని వైన్ షాపులు, టాడీ డిపోలు, ఐఎంఎల్ దుకాణాలు, 2-B బార్లు, క్లబ్బులు, టీడీ-1, సిఎస్-2 లైసెన్సు ఉన్న ప్రదేశాలను మూసివేయాలని జిల్లా పోలీస్ కమిషనర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సాయి చైతన్య, IPS ఆదేశాలు జారీ చేశారు.1968 ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 20(1) కింద జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్నివైన్షాపులుమూసివేయాల్సి ఉంటుంది.

గణేష్ నిమజ్జనాల సందర్భంగా ప్రజా శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన దుకాణాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీస్, ఎక్సైజ్ అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా స్టేషన్ హౌస్ అధికారుల ద్వారా లైసెన్స్ దారులకు నోటీసులు అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

👉 గణేష్ నిమజ్జనాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment