*ఏపీలో మద్యం కొనుగోళ్లు ఆపేస్తాం: వైన్స్ ఓనర్స్*
ఏపీలో మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రకటించిన 20% కమీషన్ ఇవ్వాలని వైన్స్, బార్ల యజమానులు
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇవాళ కడపలో సమావేశమైన మద్యం షాపుల ఓనర్లు ఈనెల 5న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 14వ తేదీలోపు కమీషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం 9.5% కమీషన్ ఇస్తున్నారని, దీనితో లైసెన్స్ ఫీజులు కట్టలేమని చెబుతున్నారు.