*శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో తమ ఎలక్ట్రిక్ ఎస్ యు వి మోడళ్లను ప్రదర్శిస్తోన్న విన్‌ఫాస్ట్*
*ప్రశ్న ఆయుధం, జూన్ 22, శేరిలింగంపల్లి,ప్రతినిధి*
హైదరాబాద్ లో శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఇటీవల తాము విడుదల చేసిన విద్యుత్ వాహనాలను విన్‌ఫాస్ట్ సంస్థ ప్రదరిస్తోంది. భారతదేశంలోని 11 రాష్ట్రాల లోని ప్రధాన నగారాల్లోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో తమ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్ యు వి విఎఫ్ 7 మరియు విఎఫ్ 6లను ప్రదర్శిస్తోన్నట్లు వెల్లడించిన విన్‌ఫాస్ట్ అందులో భాగంగా హైదరాబాద్ లో వీటిని ప్రదర్శిస్తున్నామని వెల్లడించింది.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో వీటిని విడుదల చేసిన తర్వాత బహిరంగంగా వీటిని ప్రదర్శించడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా విన్‌ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మాట్లాడుతూ “భారత్ మొబిలిటీ ఎక్స్‌పో వద్ద సానుకూల స్పందన అందుకున్న తర్వాత, విఎఫ్ 7 మరియు విఎఫ్ 6 లను భారతీయ వినియోగదారులకు దగ్గరగా తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగా వీటిని ఈ మాల్ లో ప్రదర్శిస్తున్నాము. ఈవీ ప్రేమికులు మా ఎలక్ట్రిక్ ఎస్ యు వి లను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఇది అవకాశాన్ని అందిస్తుంది అని అన్నారు.