Site icon PRASHNA AYUDHAM

చలికాలంలో మాత్రమే దొరికే సూపర్ ఫుడ్.. ఇవి కనిపిస్తే అస్సలు వదలకండి

చలికాలంలో
Headlines in Telugu
  1. చలికాలంలో తాటి గేగులు తప్పనిసరి: ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి
  2. మలబద్ధకం నుంచి విముక్తి: తాటి గేగుల ప్రయోజనాలు
  3. బరువు తగ్గేందుకు తాటి గేగులు ఎలా సహాయపడతాయి?
  4. బలమైన ఎముకల కోసం తాటి గేగులు తినాల్సిందే
  5. రక్తహీనతకు చెక్ పెట్టే తాటి గేగులు

ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో దొరికే తాటి గేగులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో శరీరానికి అవసరమైన పోషక విలువలు ఉండటం వల్ల ఈ సీజన్ లో తప్పకుండా తినాల్సిన సూపర్ ఫుడ్ గా వీటిని చెప్తారు..

తాటి గేగులు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. 

మలబద్ధకాన్ని తరిమేస్తుంది.. 

చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారికి తాటి గేగుల్లో ఉండే ఫైబర్ గొప్పగా పనిచేస్తుంది. పేగుల కదలికలను నియంత్రించడం ద్వారా ఇది కడుపును ఖాళీ చేస్తుంది. మన శరీరం జీర్ణించుకోలేని కార్బోహైడ్రేట్లు, రక్తంలోని కొలెస్ట్రాలు, గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. 

బరువు తగ్గేందుకు..

బరువు తగ్గేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారు కచ్చితంగా మీ డైట్ లో తాటి గేగులను చేర్చుకోండి. ఇవి తింటే కడుపు ఫుల్ గా ఉన్న భావన కలగడంతో పాటు అతిగా తినాలే కోరికను తగ్గిస్తుంది. 

బలమైన ఎముకలకు.. 

బలమైన ఎముకలు, దంతాలు ఉంటేనే మనిషి రోజూవారీ పనులు సమర్థంగా చేసుకోగలడు. ఇందుకు కాల్షియం అవసరం ఎంతో ఉంది. తాటి గేగుల్లో కాల్షియం పాళ్లు మెండుగా ఉండటం వల్ల ఇది కండరాలు, ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఎముకలను పెలుసుబారిపోయేలా చేసే ఆర్థరైటిస్ వ్యాధి ఉన్నవారికి అద్భుతమైన ఆహారంగా చెప్పొచ్చు. 

రక్త హీనతకు చెక్ పెట్టొచ్చు..

వీటిని తినడం వల్ల ఒంటికి రక్తం పడుతుంది. అంతేకాదు.. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను, దాని పనితీరును పెంచుతుంది. ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వీటిని ఎండలో ఆరబెట్టి పొడిగా చేసి దానికి బెల్లం కలుపుకుని తింటే మహిళల్లో రక్తహీనత సమస్య ఇట్టే తగ్గిపోతుంది. .

Exit mobile version