Site icon PRASHNA AYUDHAM

అమ్మ దయతో లోకం అంతా సుభిక్షం డిసిఎంఎస్ చైర్మన్ కొత్వల

 

అమ్మలు కన్న అమ్మ పెద్దమ్మ దయతో లోకం అంతా సుభిక్షంగా ఉంటుందని డీసీఎంస్చై ర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అక్టోబర్ 3 వ తేదీన ప్రారంభం కానున్న శ్రీదేవి నవరాత్రుల సందర్బంగా ఏర్పాటు చేయనున్న ఉత్సవాల మండప నిర్మాణపు పనులకు కొత్వాల కర్ర పూజ చేశారు. స్టానిక పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని బొల్లోరి గూడెం రామాలయంసెంటర్ వద్ద భద్రకాళి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల పనులను సోమవారం కొత్వాల కర్ర పూజ చేసి ప్రారంభించారు. పూజారి ఫణి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా శుభమే జరుగుతుందన్నారు. నిత్యం అమ్మ వారిని కొలిస్తే ప్రాంతం అంతా సస్య శ్యామలమవుతుందని కొత్వాల అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, నాయకులు వై. వెంకటేశ్వర్లు, ఉత్సవ నిర్వాహకులు పత్యం సురేష్, యస్వంత్, సత్తెనపల్లి శ్రీకాంత్, కంటే సాగర్, ముడిగే సాయి, సంఘ అశోక్, చిప్పా సత్యం, నల్లబోతు సాయి, ఇమ్మడి సాయి కుమార్త దితరులు పాల్గొన్నారు.

Exit mobile version