*కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు*
* దొంగలను తిరిగి పార్టీలోకి చేర్చుకోం*
* కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదు
* టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించామన్న హరీశ్..
* ఏ శాఖ కావాలి అంటే నాకు తెలంగాణ శాఖ కావాలని కేసీఆర్ అడిగాడు..నేను శాఖ కోసం, మంత్రి పదవి కోసం రాలేదు.. తెలంగాణ కోసం వచ్చాం అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకంలో రాశారు అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు.
సిద్దిపేట దీక్షా దివస్‌లో మాట్లాడిన హరీశ్ రావు..తెలుగుదేశం పార్టీతో కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అడ్డంకిగా ఉండి.. జై తెలంగాణ అంటలేదు. అప్పుడున్న రాజకీయ అవసరాలతో, తెలుగుదేశంతో కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని టీడీపీతో కేసీఆర్ తీర్మానం చేపించాడు..
కాని, ఎన్నికలు అయిపోయాక టీడీపీ మాట మార్చిందన్నారు. కెసిఆర్ లేకపోతే నవంబర్ 29 లేదు. కేసీఆర్ లేకుంటే డిసెంబర్ 9 లేదు .కేసీఆర్ లేకపోతే జూన్ రెండు లేదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.
సిద్దిపేట జిల్లా దీక్షా దివాస్‌లో పాల్గొని మాట్లాడిన హరీశ్..రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట..నవంబర్ 29 రోజు నలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్టు చేసిన ఆనాటి ఆనవాళ్లు లేకుండా చేస్తావా? చెప్పాలన్నారు. ఖమ్మం జిల్లాలో మూడు రోజులు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా?,డిసెంబర్ 9 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆనవాలు లేకుండా చేస్తావా?,ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు రేవంత్ రెడ్డి? చెప్పాలన్నారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆనవాలు లేకుండా చేస్తావా?, జై తెలంగాణ అన్న వారిపై తుపాకీ పట్టుకొని బయలుదేరిన నీ మరకను చెరపలేవు. అది ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుందన్నారు. కేసిఆర్ కీర్తిని నువ్వు తుడిచేయలేవు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ ఉంటారు..లగిచర్లలో గిరిజనులు కొట్టిన దెబ్బకు..
ఫార్మా కంపెనీ ఏర్పాటును రేవంత్ రెడ్డి రద్దు చేసుకున్నాడు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ పెళ్లి చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే వారి జీవితాన్ని త్యాగం చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాయకుడు రాకపోతాడా అని ఎదురుచూస్తున్నాడు అన్నారు. అప్పుడే కెసిఆర్ గారు జై తెలంగాణ నినాదంతో బయలుదేరారు…2001 ఏప్రిల్ 27వ తేదీన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం మొదలుపెట్టారు అన్నారు. ఇదే సిద్దిపేట గడ్డ నుండి తను నమ్మిన దైవానికి దండం పెట్టుకొని జలదృశ్యానికి వెళ్లి అక్కడ పార్టీని ప్రకటించారు…2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తు పొత్తు పెట్టుకునే నాటికి తెలంగాణ ప్రాంతంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అని అంటేనే పొత్తుకి ఒప్పుకున్నాము.కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రి పదవి తీసుకోవాలంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని రాస్తేనే ప్రభుత్వంలో చేరుతాము అని షరతు పెట్టిండు కేసీఆర్ అన్నారు. కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాతే క్యాబినెట్లో చేరారు…సోనియా గాంధీ తరపున ఆనాటి కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రణబ్ ముఖర్జీ…కేసీఆర్ ని కలిశారు అన్నారు. ఆరోజు కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే పొత్తులో భాగంగా తన మంతృత్వ శాఖను కూడా త్యాగం చేశారు. ‘ద కోయిల్యూషన్ ఇయర్’ అనే పేరుతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుస్తకం రాశారు.
ఆ పుస్తకంలో కేసీఆర్ గురించి గొప్పగా చెప్తారు. ఏ శాఖ మీకు కావాలి అనే ప్రణబ్ ముఖర్జీ గారు అడిగినప్పుడు నేను శాఖ కోసం రాలేదు మంత్రి పదవి కోసం రాలేదు నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం అని సమాధానం చెప్పారు అన్నారు. కెసిఆర్ లో తెలంగాణ రాష్ట్రం కోసం వారి నిబద్ధతను చూశాను అని రాశారు అన్నారు. ఈరోజు ఎవరెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు..కెసిఆర్ పనిచేయకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా?
చెప్పాలన్నారు. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి 2004 నుండి 2009 వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించకుండా ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్…రాజశేఖర్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్రం గురించి అసెంబ్లీలో అడిగితే 100 కోట్ల మంది ఒప్పుకుంటేనే తెలంగాణ ఇస్తామని ఎద్దేవా చేసేవారు… తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఇదేమైనా సిగరెటా బిరియానీనా అనిఅవహేళన చేసేవారు అన్నారు. ఇకపై హైదరాబాదుకు వెళ్లాలంటే పాస్పోర్ట్ వీసా కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా రెచ్చగొట్టారు..టిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని ఇక్కడ ఎమ్మెల్యేలను ప్రలోభాల గురిచేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుతున్నారు..
కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీకి చలనం రాలేదు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశాం అన్నారు. డిసెంబర్ 24 నాడు దీక్షా శిబిరాన్ని సిద్దిపేటలో ప్రారంభిస్తే 1531 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగే వరకు దీక్ష శిబిరాన్ని కొనసాగించాము..దేశ స్వతంత్రం కోసం పోరాడిన సమర యోధులది ఎంత గొప్ప పాత్రనో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులది కూడా అంతే గొప్ప పాత్ర అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 350 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి మమ్మల్ని అణచివేయాలని చూశారు…ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు మీద వందల్లో కేసులు నమోదయ్యాయి అన్నారు.
ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక కేసైనా ఉందా? ఎప్పుడైనా జై తెలంగాణ అని అన్నాడా ?అమరులకు ఎప్పుడైనా ఒక పువ్వు పెట్టాడా?, రేవంత్ రెడ్డి మీద ఒక కేసు అయితే అయింది.. అది ఓటుకు నోటు కేసు అన్నారు. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్న ప్రభుత్వం, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట..నవంబర్ 29 రోజు నలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్టు చేసిన ఆనాటి ఆనవాళ్లు లేకుండా చేస్తావాఖమ్మం జిల్లాలో మూడు రోజులు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా డిసెంబర్ 9 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆనవాలు లేకుండా చేస్తావా
అన్నారు. ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు రేవంత్ రెడ్డి?, జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆనవాలు లేకుండా చేస్తావా? చెప్పాలన్నారు. కెసిఆర్ లేకపోతే నవంబర్ 29 లేదు.
కేసీఆర్ లేకుంటే డిసెంబర్ 9 లేదు .కేసీఆర్ లేకపోతే జూన్ రెండు లేదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు..జై తెలంగాణ అన్న వారిపై తుపాకీ పట్టుకొని బయలుదేరిన నీ మరకను చెరపలేవు. అది ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుందన్నారు. కేసిఆర్ కీర్తిని నువ్వు తుడిచేయలేవు.
తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ ఉంటారు.లగిచర్లలో గిరిజనులు కొట్టిన దెబ్బకు.. ఫార్మా కంపెనీ ఏర్పాటును రేవంత్ రెడ్డి రద్దు చేసుకున్నాడు…మెట్రో రైల్ రద్దు, ఫార్మాసిటీ రద్దు,ఇప్పుడు లగిచర్ల ఫార్మా కూడా రద్దు చేసుకున్నాడన్నారు.కొత్త ఉత్సాహంతో అందరం ముందుకు సాగుదాం… తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం. జై తెలంగాణ అన్నారు.